ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారుల తీరుతో సీవోఈలు, పలు గురుకులాల్లోని విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెరుగైన శిక్షణ పొందలేని దుస్థితి నెలకొన్నది.
ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రధాన పో స్టుల నియామకానికి సంబంధించిన స్టాండింగ్ ఆర్డర్స్‌కు తూట్లు పొడించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2017లో ఇచ్చిన మార్గదర్శకాలకు పాతరవేసేందుకు సైతం పూనుకున్నది.