ఆరోగ్య రంగంలో అగ్రగామిగా తెలంగాణ : మంత్రి ఈటల
ఆరోగ్య రంగంలో అగ్రగామిగా | సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

సూర్యాపేట : సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని సహచర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, స్థానిక మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, డీఎంహెచ్‌ఓతోపాటు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గర్భిణులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
పూర్తి వసతులతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం వారంరోజుల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు.
అనంతరం విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో భవనం నిర్మాణం త్వరితగతిన పూర్తిచేశామని తెలిపారు.
ప్రజలకు కార్పొరేట్‌స్థాయి వైద్య సేవలు అందించేందుకు కొత్త జిల్లాల్లోనూ మెడికల్ కళాశాలలు స్థాపించామని గుర్తుచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

