సూర్యాపేట రూరల్ : అయ్యప్ప మాలధారణ, ఎంతో పవిత్రమైందని, అయ్యప్ప దీక్షా సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని 13వార్డు గాంధీనగర్ సమీపంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద డీసీయంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన 18వ మహాపడి పూజ, ఇరుముడి కార్యక్రమంలో మంత్రి దంపతులు ముఖ్య అతిధులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అయ్యప్పస్వామి 41 రోజుల దీక్షలో భక్తిభావంతో పాటు క్రమశిక్షణ అలవాటవుతుందన్నారు. అయ్యప్పస్వామి దీక్ష చేయడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుందన్నారు. అయ్యప్ప ఇరుముడి కట్టి అయ్యప్ప దర్శనానికి వెల్లే స్వాములు శబరిమల యాత్ర విజయవంతంగా ముగించుకోని తిరిగిరావాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వట్టె జానయ్యయాదవ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, నాగారం వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల, కౌన్సిలర్ వట్టె రేణుక, అయ్యప్ప మాలధారణ స్వాములు ఉపేందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.