నయా మాల్ – ఇంటికి స్మార్ట్ భద్రత
తాళం చెవుల తలనొప్పి లేకుండానే ఇంటి భద్రతను పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే, Yale Zuri S Smart Lockవైపు ఓ లుక్కేయండి. ఈ ఆధునిక స్మార్ట్‌లాక్.. మీ ఇంటిని మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మార్చేస్తుంది.
తాళం చెవుల తలనొప్పి లేకుండానే ఇంటి భద్రతను పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే, Yale Zuri S Smart Lockవైపు ఓ లుక్కేయండి. ఈ ఆధునిక స్మార్ట్‌లాక్.. మీ ఇంటిని మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మార్చేస్తుంది. తాళం చెవులతో పని లేకుండానే.. పిన్ కోడ్, ఫింగర్‌ప్రింట్ ద్వారా మీకు మాత్రమే యాక్సెస్ ఇస్తుంది. చాలా స్లిమ్‌గా ఉండే ఈ స్మార్ట్ లాక్.. మీ ఇంటికి ప్రీమియం లుక్‌ను తీసుకొస్తుంది. ఇందులోని ‘జియో-ఫెన్సింగ్’ టెక్నాలజీతో మీరు ఇంటికి దగ్గరగా రాగానే.. తలుపు ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. వై-ఫై, బ్లూటూత్తోపాటు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, ఎన్క్రిప్షన్ వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. మీరు ఎక్కడున్నా.. హేల్హోమ్ యాప్ ద్వారా మీ ఇంటి తలుపును నియంత్రించవచ్చు.
ధర: 13,199
దొరుకుచోటు: యేల్ అధికారిక వెబ్సైట్
మామూలు మాప్ కాదు..

ఎంత అధునాతన వ్యాక్యూమ్ క్లీనర్ ఉన్నా.. ఇంటిని మాప్ వేసి తుడిస్తేనే తృప్తి! అయితే, మామూలు మాప్‌లతో నడుము నొప్పి ఇబ్బంది పెడుతుంది. అయితే, ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘అగారో’ కొత్తగా తీసుకొచ్చిన AGARO Regency Electric Spin Mop.. మీ ఇంటి పనిని సులభతరం చేస్తుంది. ఇందులోని మాపర్ ఫ్యాబ్రిక్ డిస్క్.. 150 ఆర్పీఎం వేగంతో పనిచేస్తుంది. డ్యూయల్ స్పిన్నింగ్ హెడ్స్ సాయంతో నేలపై ఉన్న మొండి మరకలను సులభంగా తొలగించేస్తుంది. ఇందులో 175 మి.లీ కెపాసిటీతో వాటర్ ట్యాంక్ ఉన్నది. ఒక్క బటన్ నొక్కితే చాలు.. నీళ్లు, క్లీనింగ్ లిక్విడ్‌ను నేలపైకి స్ప్రే చేస్తుంది. ఆ వెంటే మాప్‌తో శుభ్రం చేస్తుంది. ఇక దీనికుండే అడ్జస్టబుల్ హ్యాండిల్‌ను మీ ఎత్తుకు అనుగుణంగా మార్చుకోవచ్చు. బరువు తక్కువగా ఉండటం వల్ల పెద్దవాళ్లు కూడా సులభంగా వాడుకోవచ్చు. బ్యాటరీతో పనిచేసే ఈ అధునాతన మాప్‌ను ఒకసారి ఫుల్‌చార్జ్ చేస్తే 40 నుంచి 60 నిమిషాల వరకు వాడుకోవచ్చు. ఫ్లోర్‌తోపాటు కిటికీ అద్దాలు, గోడల టైల్స్‌ను కూడా శుభ్రం చేసుకోవచ్చు.
ధర: రూ.3,999
దొరుకుచోటు: అమెజాన్
చల్లదనం మీ వెంటే..

మండుతున్న ఎండలతో ఉక్కపోత భరించలేకుండా ఉన్నది. ఇంట్లో కరెంట్ లేనప్పుడు, బయటికి వెళ్లినప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ సరికొత్త Zebronics Heat Buster 200 పోర్టబుల్ హ్యాండ్ ఫ్యాన్ మీ వెంట ఉంటే.. ఉక్కపోత నుంచి ఇట్టే ఉపశమనం లభిస్తుంది. ఇందులో యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీతోపాటు 5000 ఆర్పీఎం వేగంతో తిరిగే ఫ్యాన్ ఉంది. ఇది కేవలం గాలిని మాత్రమే కాకుండా.. ఏసీ లాంటి చల్లని అనుభూతిని ఇస్తుంది. ఫ్యాన్ పైన డిజిటల్ స్క్రీన్ ద్వారా బ్యాటరీ ఎంత ఉంది? ఫ్యాన్ ఏ స్పీడ్‌లో తిరుగుతున్నదో సులభంగా తెలుసుకోవచ్చు. ఇందులో 3600 ఎంఏహెచ్ సామర్థ్యం గల రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 12 గంటలపాటు చల్లని గాలిని అందిస్తుంది. చాలా చిన్నగా, తేలికగా ఉండే ఈ ఫ్యాన్‌ను మీ హ్యాండ్‌బ్యాగ్, జేబులో కూడా పెట్టుకొని వెళ్లొచ్చు. ప్రయాణాల్లో, ఎండలో బయటికి వెళ్లినప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ధర: రూ.899
దొరుకుచోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
కమ్మటి నిద్రకు స్వాగతం!

రాత్రిపూట నిద్ర పోయినప్పుడు ఎదురయ్యే రెండు అతిపెద్ద సమస్యలు.. నడుము నొప్పి, చెమట. మనదేశంలో దాదాపు సగం మంది వీటి బాధితులే! ఈ రెండు సమస్యలకూ చెక్ పెడుతూ.. ప్రముఖ మ్యాట్రెస్ కంపెనీ డ్యూరోఫ్లెక్స్ Duropedic AirBoost 6.8 AI Pro పేరుతో అత్యాధునిక స్మార్ట్ మ్యాట్రెస్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఉండే ఏఐ సెన్సర్లు మీ స్లీపింగ్ పొజిషన్‌ను గుర్తించి, దానికి అనుగుణంగా మ్యాట్రెస్ గట్టిదనాన్ని అడ్జస్ట్ చేస్తాయి. ఇక ఎయిర్ బూస్ట్ టెక్నాలజీ మ్యాట్రెస్ లోపల గాలి ప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. దీనివల్ల నిద్రపోతున్నప్పుడు శరీరం వేడెక్కకుండా చల్లగా ఉంటుంది. మ్యాట్రెస్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసి.. నిద్ర నాణ్యతను ట్రాక్ చేయవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఒకే మ్యాట్రెస్‌పై పడుకున్నప్పుడు.. ఎవరికి కావాల్సిన గట్టిదనాన్ని వారు విడిగా సెట్ చేసుకోవచ్చు కూడా! యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ వల్ల ఫ్యాబ్రిక్ దుమ్ము, బ్యాక్టీరియా చేరకుండా
రక్షణనిస్తుంది.
ధర: సైజును బట్టి రూ. 45,000 – రూ.85,000
దొరుకుచోటు: డ్యూరోఫ్లెక్స్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

