కొందరు గాఢ నిద్రపోతుంటారు. ఎన్నిసార్లు అలారం మోగినా.. నిద్రలోంచి మేల్కోరు. అలాంటివారిని Xech Alarm Clock ఇట్టే నిద్ర లేపేస్తుంది. ఇందులోని స్పీకర్ చాలా బిగ్గరగా మోగుతుంది. కాబట్టి, ఎంత గాఢ నిద్రలో ఉన్నవారైనా సరే ఇట్టే మేల్కోవాల్సిందే! అలారం మోగినప్పుడు బద్ధకంగా అనిపిస్తే.. మళ్లీ కాసేపు నిద్రపోవడానికి ‘Snooze’ బటన్ ఉండనే ఉంది. అయితే, ఇది మళ్లీమళ్లీ మోగుతూ మిమ్మల్ని పూర్తిగా నిద్ర లేచేలా చేస్తుంది. సమయం స్పష్టంగా కనిపించేలా పెద్ద అంకెలతో కూడిన డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. కరెంట్ పోయినా అలారం ఆగకుండా పనిచేయడానికి ఇందులో ఇన్‌బిల్ట్ రీచార్జబుల్ బ్యాటరీ ఉన్నది. దాదాపు నాలుగు గంటల ఎమర్జెన్సీ బ్యాకప్‌గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది బ్లూటూత్ ద్వారా మీ ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. ఇందులో 5W స్పీకర్ ఉంటుంది. ఇది పాటలు వినడానికి, వీడియోలు, కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుకోవడానికీ, ఇతర మల్టీమీడియా కంటెంట్ కోసం పనిచేస్తుంది.
ధర: 1,299 దొరుకుచోటు: అమెజాన్
స్మార్ట్ యుగానికి.. స్మార్ట్ పెన్!

ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో డిజిటల్ ఆర్ట్‌ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ ఆర్టిస్టులూ పెరిగారు. ట్యాబ్‌లోనే అద్భుతమైన ఆర్ట్స్ వేసేస్తున్నారు. వారితోపాటు ఇలస్ట్రేటర్లు, కాలిగ్రఫీ చేసేవారూ.. ట్యాబ్‌ల్లోనే ట్యాలెంట్ చూపిస్తున్నారు. ఇలాంటి వారి కోసం అత్యంత అధునాతన స్టయిలస్.. Wacom Art Pen 2 అందుబాటులోకి వచ్చింది. ఇతర స్టయిలస్లతో పోలిస్తే.. స్క్రీన్‌పై మరింత సహజమైన, సంప్రదాయ ఆర్ట్ ఫీలింగ్‌ను అందిస్తుంది. 360 డిగ్రీల రొటేషన్ సెన్సిటివిటీ దీని ప్రత్యేకత. పెన్నును చేతితో తిప్పుతున్నప్పుడు.. స్క్రీన్‌పై బ్రష్ స్ట్రోక్ కూడా అదే యాంగిల్లో తిరుగుతుంది. కాలిగ్రఫీ పెన్నులు, ఫ్లాట్ బ్రష్‌లు, చార్కోల్ స్కెచ్‌లతో గీసేటప్పుడు.. అచ్చం నిజమైన పేపర్‌పై గీసిన అనుభూతిని ఇస్తుంది. ఇందులో మిలియన్ లెవెల్స్‌లో ప్రెజర్ సెన్సిటివిటీ ఉంటుంది. దాంతో, పెన్నును గట్టిగా నొక్కితే లావుపాటి గీతలు, తేలికగా వదిలితే సన్నటి లైన్స్ వస్తాయి. ఇందులోని షార్ట్‌కట్ బటన్స్ ద్వారా మీకు నచ్చిన టూల్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు కూడా.
కదిలితేనే వెలుగు

కిచెన్ షెల్ఫ్‌లు, వార్డ్‌రోబ్‌లలో లైటింగ్ సమస్య ఇబ్బంది పెడుతుంది. ఆయాచోట్ల పెట్టిన వస్తువులను చీకట్లో వెతుక్కోవడం కష్టం అవుతుంది. FLYNGO Motion Sensor Under Cabinet LED Lightఉంటే.. ఆ కష్టం తప్పుతుంది. ఆధునిక ఇళ్లకు.. ముఖ్యంగా వంటగది, వార్డ్రోబ్ కోసం ఇదో స్మార్ట్ లైటింగ్ సొల్యూషన్. దీన్ని ఏర్పాటు చేసుకుంటే.. చీకట్లో స్విచ్‌లు వెతుక్కునే పని ఉండదు. కేవలం మీ కదలికలను గుర్తించే వెలుగుతుంది. 10 అడుగుల పరిధిలో ఏదైనా కదలికను గుర్తిస్తే.. ఆటోమేటిక్‌గా లైట్ ఆన్ అవుతుంది. ఆ పరిధిలో ఎలాంటి కదలిక లేకపోతే.. 15 నుంచి 20 సెకన్లలో ఆఫ్ అయిపోతుంది. వంటగది అరల కింద చీకటిగా ఉన్నప్పుడు వస్తువులు స్పష్టంగా చూపిస్తుంది. బట్టల అల్మారా తలుపు తీయగానే వెలుతురుతో నింపేస్తుంది. చీకటిగా ఉన్నప్పుడు, రాత్రి వేళల్లో మాత్రమే స్పందిస్తుంది. పగటిపూట అనవసరంగా లైట్ ఆన్ అవ్వదు. దాంతో బ్యాటరీ ఆదా అవుతుంది. ఇందులో ఇన్‌బిల్ట్ రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. సాధారణ యూఎస్బీ కేబుల్ ద్వారా సులభంగా చార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి చార్జ్ చేస్తే, మోషన్ సెన్సర్ మోడ్‌లో చాలారోజులు పనిచేస్తుంది.
హీట్‌ను బీట్ చేయండి!

ల్యాప్‌టాప్‌పై రిమోట్ వర్కింగ్ చేసేవాళ్లను, గేమర్లను హీటింగ్ సమస్య విసిగిస్తూ ఉంటుంది. ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉండే ల్యాపీపై చాలాసేపు పనిచేయడం వల్ల త్వరగా వేడెక్కుతుంది. ఈ సమస్యకు Dyazo Foldable Metal Laptop & Mobile Stand మంచి పరిష్కారం చూపుతుంది. అల్యూమినియం అల్లాయ్ మెటల్‌తో తయారైన ఈ స్టాండ్.. గేమింగ్ ల్యాప్‌టాప్ బరువును సులభంగా మోసేస్తుంది. దీనిని ఇంట్లో వాడేందుకే కాదు.. మడతపెట్టి బ్యాగ్‌లోనూ పెట్టుకోవచ్చు. ఆఫీస్‌కు, ప్రయాణాల్లో తీసుకువెళ్లడానికి వీలుగా ఉంటుంది. రెండు కూలింగ్ ఫ్యాన్లు.. ల్యాపీ నుంచి విడుదలయ్యే వేడిని త్వరగా బయటికి పంపేస్తాయి. దీనివల్ల ల్యాపీ హీట్ అవ్వకుండా, హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తుంది. ఈ ఫ్యాన్లు పనిచేయడానికి ల్యాప్‌టాప్ యూఎస్బీ పోర్ట్, పవర్ బ్యాంక్ ద్వారా పవర్ అందించవచ్చు. ఇక యూజర్ కంటి చూపు లెవెల్‌కి తగ్గట్టుగా.. దీని ఎత్తును, యాంగిల్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌తోపాటు పక్కనే మొబైల్ పెట్టుకోవడానికి స్టాండ్హోల్డర్ కూడా ఉన్నది. కాబట్టి, ల్యాపీలో వర్క్ చేసుకుంటూనే మొబైల్ నోటిఫికేషన్స్ చూసుకోవచ్చు. యా స్లిప్ సిలికాన్ ప్యాడ్స్ వల్ల.. ల్యాపీ జారిపోకుండా, దానికి గీతలు పడకుండా ఉంటాయి.