కొత్తింటి.. పాత వైభవం!
‘ఇది మా తాతగారిల్లు’, ‘మా పూర్వీకులు ఇదిగో ఈ భవంతిలోనే ఉండేవారట’ అని ఎవరైనా చెప్పినప్పుడు ఒకింత ఆశ్చర్యంగా, ఇంకొంత ఆనందంగా చూస్తున్నారు జనం. ఎందుకంటే, ఇప్పుడు ఇల్లు ఎంత పాతదైతే అంత గొప్ప.
- ఉండే ఇల్లయినా, వేసుకునే దుస్తులైనా.. ఎంత అల్ట్రా మోడ్రన్‌గా
- ఉంటే అంత గొప్ప. కానీ ఇప్పుడు రూటు మారింది. నగలూ,
- డ్రెస్సుల్లో యాంటిక్ సొగసులు ముందుకొచ్చాయి.
- ఆ పోకడ ఇంటి అలంకరణకూ పాకింది. వింటేజ్ హోమ్స్ హాటెస్ట్ ట్రెండ్!
- తాత ముత్తాతల కాలం నాటి స్తంభాలు, వసారాల నమూనాలు ఆధునిక భవంతుల్లో కనిపిస్తున్నాయి.
‘ఇది మా తాతగారిల్లు’, ‘మా పూర్వీకులు ఇదిగో ఈ భవంతిలోనే ఉండేవారట’ అని ఎవరైనా చెప్పినప్పుడు ఒకింత ఆశ్చర్యంగా, ఇంకొంత ఆనందంగా చూస్తున్నారు జనం. ఎందుకంటే, ఇప్పుడు ఇల్లు ఎంత పాతదైతే అంత గొప్ప. పాత కలపతో తీర్చిదిద్దిన స్తంభాలు, కిటికీలు, పైకప్పులు.. అన్నీ మధుర స్మృతులే. వాటిని పదిల పరచుకునేందుకు పొదరింటిని అదే రీతిలో పొందికగా కట్టుకుంటున్నారు. ఇంటా బయటా వెన్నెల్లో గోరుముద్దలు తిన్న జ్ఞాపకం చాలా మందికి ఉండే ఉంటుంది. ఆవకాయ ముద్ద, అందమైన చంద్రుడు మాత్రమే కాదు.. కూర్చున్న వాకిలి, ఆ పక్కనున్న అరుగులు.

ఊయల కట్టుకున్న దూలాలూ..
ఇలా అన్నీ ఆ దృశ్యంలో నిక్షిప్తమయ్యే ఉంటాయి. అందుకే అన్ని వసతులూ ఉండే కాంటెంపరరీ ఇళ్లను పాతకాలపు టచ్‌తో కట్టుకుంటున్నారు. ఇంటి ముందు వసారాలు, అరుగులు, స్తంభాలతో పాటు లోపల కూడా ఈ లుక్ వచ్చే ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుంటున్నారు. మొత్తం మోడ్రన్‌గా ఉన్నా ఇంట్లో కొంత భాగమైనా ఇలా సంప్రదాయ లుక్‌లో కనిపించాలని కోరుకుంటున్నారు. కొందరైతే మండువా తరహాలో గది
మధ్యలో నాలుగు స్తంభాలతో ఖాళీ స్థలం ఉండేలానూ నిర్మించుకుంటున్నారు. మట్టితో చేసిన పెంకులు కూడా ఇందులో భాగం అవుతున్నాయి. మొత్తంగా ఇంటికి వింటేజ్ లుక్ తీసుకురావడంలో ఎంతో విజయం సాధిస్తున్నారు నేటి తరం ఆర్కిటెక్ట్‌లు. మన ఇల్లు తీపి జ్ఞాపకాల పొదరిల్లులా మారితే అంతకంటే.. ఆనందం
ఏముంటుంది చెప్పండి!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

