The Plated project | ఒక్క ప్లేటుతో 14 మంది పిల్లల ఆకలి తీరుస్తున్నరు
The Plated Project | అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని అంటారు. అయినా, తాము కడుపునిండా తింటున్న ప్రతిసారీ, పస్తులతో పడుకుంటున్న నిర్భాగ్యుల గురించి ఆలోచించేవారు ఎంతమంది ? ఆస్తి, సంపాదన పక్కనపెడితే.. పేదవాడి కడుపు నింపేవాడే నిజమైన శ్రీమంతుడు. ఇదే ఆలోచనతో అడుగు వేసింది ‘ది ప్లేటెడ్ ప్రాజెక్ట్’.

ఒక ప్లేటు = 14 మంది పిల్లలకు అన్నం! ది ప్లేటెడ్ ప్రాజెక్ట్ లెక్క ఇది. ఒక ప్లేటు అమ్మకంతో వచ్చే డబ్బుతో 14 మంది నిరుపేద పిల్లల కడుపులు నింపుతున్నదీ సంస్థ. ‘ప్లేటు కొనండి. పేదోడికి ప్లేటు భోజనం పెట్టండి’ అన్న నినాదంతో ముంబైకి చెందిన చిత్రేశ్ సిన్హా 2019లో ఈ అన్న యజ్ఞాన్ని ప్రారంభించారు. మొదటి కొన్ని నెలల్లోనే 40మంది కళాకారులు చేతులు కలిపారు. ఏడాది నుంచీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది. ఈ రంగురంగుల కంచాలు తినడానికే కాదు, గోడల మీద, షెల్ఫులలో అలంకరణకు కూడా బాగుంటాయి. ఈ ప్లేట్ల ధర రూ.1,420 నుంచి మొదలవుతుంది. ‘ప్రపంచ బాలబాలికలలో నలుగురిలో ఒకరు ఖాళీ కడుపుతో నిద్రపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎంతోమంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి వాస్తవాలెన్నో నా మనసును కదిలించాయి.

అందుకే, మా ప్రాజెక్ట్ ద్వారా పేదపిల్లల కడుపులు నింపాలని నిశ్చయించుకున్నా. నాకు కళలంటే ఆసక్తి. నేను కళాకారుణ్ని కాకపోయినా, చిత్రకళ ద్వారా వాస్తవాలను కండ్లకు కట్టినట్లు చూపించే చిత్రకారులంటే చాలా ప్రేమ. అందుకే మా ఆశయానికి దగ్గరగా ఉండేలా కళాత్మకమైన కంచాలను ఎంచుకున్నాం. వీటిని ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నాం. వీటి ద్వారా వచ్చే ప్రతి రూపాయిలో అర్ధ రూపాయి పేదల ఆకలి తీర్చేందుకు ఉపయోగిస్తున్నాం. ఈ మూడేండ్ల కాలంలో మేం ఐదు లక్షల మందికి అన్నం పెట్టాం. మా కస్టమర్లను అదనంగా ఒక్క రూపాయి కూడా అడగట్లేదు. పెద్ద మనసుతో పళ్లాలను కొంటే చాలు. పరోక్షంగా ఈ పుణ్యకార్యానికి సాయం చేసినట్లే’ అంటారు ది ప్లేటెడ్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు చిత్రేశ్ సిన్హా.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్‌లో అదరగొడుతుంది..
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Anshul Gupta | ఆ 1200 మంది మహిళల వెనుక ఒక్కడు..
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

