నేటితరం ప్రొఫెషనల్ గేమర్లు, గ్రాఫిక్ డిజైనర్లకు.. మౌస్ నియంత్రణలో కచ్చితత్వం అవసరం. వారికి అనుకూలంగా ఉండేలా అమెరికాకు చెందిన ‘టాగస్’ సంస్థ.. ‘ఎర్గో ఫ్లిప్’ పేరుతో స్మార్ట్ మౌస్‌ను తీసుకొచ్చింది. ఇందులో ‘బ్లూట్రేస్’ టెక్నాలజీని వాడారు. దీనివల్ల ఎలాంటి ఉపరితలంపైన అయినా ఇది సమర్థంగా పనిచేస్తుంది. అంతేకాదు.. దీనిని కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి చాలా సులభంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫలితంగా, ఎడమచేతి వాటం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బ్లూటూత్ 5.0తో వైర్‌లెస్‌గా కంప్యూటర్‌కు కనెక్ట్ అవుతుంది. దీని బరువు 130 గ్రాములు మాత్రమే! యాంటీ మైక్రోబయాల్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మక్రిములను నిరోధిస్తుంది. ఇందులో శక్తిమంతమైన 4000 డీపీఐ పిక్సార్ట్ ఇన్ఫ్రారెడ్ ఆప్టికల్ సెన్సార్‌ను వాడారు. ఇది ప్రొఫెషనల్ గేమర్స్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. 85 శాతం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌ను వాడి తయారుచేసిన ‘ఎర్గో ఫ్లిప్’ మౌస్ ధర. రూ. 6,300. us.targus.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.