సోషల్ హడల్!
నేటితరాన్ని సోషల్ మీడియా హడలెత్తిస్తున్నది. వారి జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. యువత ఆలోచనా విధానాన్ని, దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తున్నది. సామాజిక మాధ్యమాలపై ఎక్కువ సమయం గడుపుతున్న వారిని.. మానసిక సమస్యల్లోకీ నెట్టేస్తున్నది. ఈ క్రమంలో ముప్పు పూర్తిగా ముంచేయక ముందే.. ‘నెటిజన్లు’ మేల్కోవాల్సిన అవసరం ఉన్నది.
ఇన్ఫోగ్రాఫిక్
సోషల్ మీడియాలో కనిపించే ఫిల్టర్ చేసిన, కృత్రిమమైన ఫొటోలన్నీ నిజమేనని చాలామంది అనుకుంటున్నారు. వాటిని చూసి తమ శరీరం, ముఖం బాగాలేవని కుంగిపోతున్నారు. ఈ క్రమంలో తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు.
సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదని గుర్తించాలి. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం మానేయాలి.
అప్లోడ్ చేసిన ప్రతి పోస్ట్‌కూ క్షణాల్లో లైకులు, కామెంట్లు ఆశిస్తున్నారు. దీనివల్ల వారిలో ఓపిక నశించిపోతున్నది. నిజ జీవితంలో కష్టపడి ఫలితాలు సాధించలేక నిరాశలో కూరుకుపోతున్నారు.
ఈ సమస్యకు పుస్తకాలు చదవడమే మంచి పరిష్కారం. సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడానికి బదులుగా.. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం వల్ల ఆలోచనా విధానం మారుతుంది.
కోపాన్ని, అసహనాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. ఆన్లైన్ ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు చూసి నిజ జీవితంలోనూ తొందరపాటుగా వ్యవహరిస్తున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు దూకుడుగా, అసహనంగా వ్యవహరిస్తున్నారు.
కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం, ప్రాణాయామాన్ని సాధన చేయాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆలోచనలపై నియంత్రణ పెరుగుతుంది.

Sharing
సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ.. నిజ జీవితంలో ఒంటరిగా మిగిలిపోతున్నారు. కష్టసుఖాలు పంచుకోవడానికి నిజమైన మిత్రులు లేరనే భావనతో డిప్రెషన్లోకి వెళ్తున్నారు.
ఇలాంటి వాళ్లు ఆన్లైన్ ప్రపంచం నుంచి బయటికి వచ్చి.. నిజమైన బంధాలను బలోపేతం చేసుకోవాలి. కుటుంబ సభ్యులు, మిత్రులతో మనసు విప్పి మాట్లాడాలి. తోటివారితో కలిసి బయటికి వెళ్లడం వల్ల ఒంటరితనం మాయమై.. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తమ జీవితంలో ఏదో కోల్పోతున్నామనే భయం యువతను ఎక్కువగా వెంటాడుతున్నది. పక్కవారంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారనే భావన.. వారిని నిరంతరం ఆందోళనకు గురిచేస్తున్నది.
డిప్రెషన్లోకి వెళ్లకముందే మేల్కోవాలి. మొహమాటానికి వెళ్లకుండా.. కౌన్సెలింగ్, సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి.

Likes
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Huddle
- influence
- Infographic
- social
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

