గొప్ప కథలు.. అలంకారాలు, విచిత్ర విన్యాసాలతో కూడిన పద ప్రయోగాలు లేకుండా సూటిగా బతుకు బాధలను చిత్రిస్తాయి. ఈ విషయాన్ని చాటుతూ దళితుల జీవన చిత్రణ ప్రధానంగా జంబూ సాహితి తీసుకొచ్చిన కథా సంకలనం ‘సాక దళిత కథా వార్షిక 2022’. సాక అంటే సమర్పించడం అని అర్థం. సతీష్ చందర్ రాసిన ‘యువరానర్’ కథ అట్టడుగు వర్గానికి చెందిన స్త్రీని ప్రేమించి పెండ్లాడిన భర్త ఆ తర్వాత ఎలా వేధింపులకు గురిచేశాడో వివరిస్తుంది.
హిందూ, క్రైస్తవ మతాలు, కమ్యూనిజంతో పెనవేసుకున్న దళితుల జీవితం ఎలా ఉంటుందో పసునూరి రవీందర్ ‘ఒక నేల… మూడు ముఖాలు’ తెలుపుతుంది. భూమ్మీద లక్షలాది జీవజాతుల్లో ఒకడైన మనిషి… అత్యాశతో భూమాతను కుళ్లబొడిస్తే చివరికి జరిగేది ఏమిటో చరణ్ పరిమి ‘అతిథితో అక్కడిదాకా!’ కథలో ప్రతీకాత్మకంగా చిత్రించాడు. పల్లె, పట్నం తేడా లేకుండా కులాధిపత్యం ఎలా కోరలు చాచిందో యాకమ్మ ‘వెన్నెల గొడుగు’ కథ పట్టిచూపుతుంది.
కరోనా నేపథ్యంతో సాగిన డా.సిద్దెంకి యాదగిరి కథ ‘రుణం’ మానవత్వం గొప్పతనాన్ని చాటిచెబుతుంది. అనిల్ డానీ కథ ‘వీకెండ్’ బాగా చదువుకుని, ఉన్నతోద్యోగాలకు వెళ్లినా మూలాలు మర్చిపోని దళిత దంపతుల ఆత్మాభిమానాన్ని కండ్లకు కడుతుంది. ఎవరి ఆహారపు అలవాట్లు వారికుంటాయనే సత్యాన్ని వెల్లడిస్తుంది. మొత్తంగా చూస్తే… ‘సాక’ సంకలనంలోని కథలు గుండె లోతుల్లోని తేమను తడుముతాయి. మనిషిలో నిద్రాణమైన చైతన్యాన్ని తట్టిలేపుతాయి.
– సంపాదకులు: డా. సిద్దెంకి యాదగిరి తదితరులు
పేజీలు: 150, ధర: రూ. 150
ప్రచురణ: జంబూ సాహితి
ప్రతులకు: ఫోన్: 94412 44773
రచన: డా॥ యస్.వేణుగోపాల్
పేజీలు: 68 ధర: రూ. 75
ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ బుక్ హౌస్
రచన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య
పేజీలు: 103 ధర: రూ. 100
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 88970 73999
రచన: సయ్యద్ సలీం
పేజీలు: 70, ధర: రూ. 60
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 75886 30243