అమ్మమ్మ ఇచ్చిన చీర అప్పుడు కట్టుకుంటా!
లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, కోలీవుడ్‌లతో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకొని బాలీవుడ్‌లోనూ పాగా వేసింది. బాలీవుడ్ రామాయణ్‌తో పాటు ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ మూవీలోనూ నటిస్తుంది. జునైద్, సాయిపల్లవి జంటగా నటించిన ‘ఏక్దిన్'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి పంచుకున్న కబుర్లివి...
లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, కోలీవుడ్‌లతో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకొని బాలీవుడ్‌లోనూ పాగా వేసింది. బాలీవుడ్ రామాయణ్‌తో పాటు ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ మూవీలోనూ నటిస్తుంది. జునైద్, సాయిపల్లవి జంటగా నటించిన ‘ఏక్దిన్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి పంచుకున్న కబుర్లివి…
ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మన అభిమానులే కారణం. మనల్ని వారు అనుసరిస్తుంటారు. మనం తీసుకునే ఆహారం, వాడే సౌందర్య సాధనాలు సహా.. అభిమానులకు మనం ఆదర్శంగా ఉండాలి. అందుకే రూ.2 కోట్లు ఆఫర్ చేసినా ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌ను తిరస్కరించాను. రంగు అనేది అందానికి కొలమానం కాదన్నదని నా భావన. మేకప్ లేకుండా తెరపై కనిపించినప్పుడే మనలోని ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
మాది ఊటీకి దగ్గర్లోని కోటగిరి గ్రామం. మా అమ్మ నర్తకి. ఆమె పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడం వల్ల నా పేరు సాయి పల్లవి అని పెట్టింది. చిన్నప్పటినుంచి అమ్మ నాట్యం చూస్తూ పెరగడం వల్ల నాకూ ఆ కళపై ఆసక్తి కలిగింది. అలా నాట్యం నేర్చుకొని స్కూల్లో జరిగే పోటీల్లో బహుమతి దక్కించుకునేదాన్ని. ఓసారి నా డ్యాన్స్ చూసిన ఓ సినిమా ఏజెన్సీ వాళ్లు చిన్నపాత్ర కోసం అడిగారు. ఇంట్లోవాళ్లు వద్దన్నా.. లెక్కల క్లాస్ తప్పించుకోవచ్చనే ఆలోచనతో అమ్మను బలవంతంగా ఒప్పించి తెరపై తొలిసారి కనిపించా.
సినిమాల్లోకి రావాలని కోరిక ఉన్నా.. నా వాయిస్, వస్త్రధారణ, ముఖంపైన మొటిమలు, ఇవన్నీ చూసి ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారా? లేదా? అనే ఆందోళన ఉండేది. నాకు నేనే నచ్చకపోతే ఇక ప్రేక్షకులకు ఏం నచ్చుతాననే ఆత్మన్యూనతతో ఉండేదాన్ని. కానీ, ‘ప్రేమమ్’ దర్శకుడు ఎంతో నమ్మకంతో నన్ను ఆ సినిమాకు ఎంపిక చేశారు. ఆ చిత్రం చూసిన వాళ్లంతా ‘సాయి పల్లవి మా ఇంటి అమ్మాయిలా కనిపించింది’ అని చెబితే సంతోషం కలిగింది.
నాకు 21 ఏళ్లున్నప్పుడు, పెళ్లికి కట్టుకోమని అమ్మమ్మ ఒక చీరను బహుమతిగా ఇచ్చింది. అప్పుడు నేను ఎంబీబీఎస్ చదువుతున్నా. ఏదో ఒకరోజు జాతీయ అవార్డు అందుకుంటానని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే అనుకున్నాను. అ సమయంలో కచ్చితంగా అమ్మమ్మ ఇచ్చిన చీర కట్టుకొని ఆ అవార్డు అందుకోవాలని నిర్ణయించుకున్నా. అది నా కోరిక.
సినిమా అవకాశాల కోసం పొట్టి డ్రెస్ వేసుకోవడం, స్కిన్ షో చేయడం వంటి వాటికి నేను దూరం. లగ్జరీలకు దూరంగా సింపుల్ లైఫ్ అంటేనే నాకు ఇష్టం. నేను ధరించే దుస్తులే నన్ను రక్షిస్తాయని నమ్ముతా. వాటినే ఇష్టపడతాను కూడా. ‘ఏక్దిన్’ సినిమాలో నా నటనను కొత్తగా చూడబోతున్నారు. ఇందులో రోహన్‌గా జునైద్, మీరా పాత్రలో నేను సహోద్యోగులుగా మీకు కనిపిస్తాం.
నటనతో పాటు ఇతర అభిరుచులకూ ప్రాధాన్యం ఇస్తుంటాను. తేనెటీగల పెంపకం పట్ల ఆసక్తి పెంచుకున్నా. బన్‌మస్కా, కొబ్బరినీళ్లు అంటే ఎంతో ఇష్టం. ప్రెండ్స్‌తో బయటికి వెళ్లిన ప్రతిసారీ వాటిని రుచిచూస్తా. నిద్రకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. రోజూ రాత్రి తొమ్మిదింటికే పడుకుంటా. డ్యాన్స్, యాక్టింగ్ కాకుండా యోగా, ధ్యానం అంటే కూడా ఇష్టమే. ఒత్తిడిని దూరం చేసే ఈ రెండిటి గురించి లోతుగా తెలుసుకుంటుంటాను.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

