వెండితెరపై మొదటి అవకాశంతోనే మెగాస్టార్ సినిమాలో చాన్స్ కొట్టేసిన అందాల నటి శాన్వి మేఘన. వైవిధ్యమైన పాత్రలతో వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లోనూ దూసుకుపోతున్నది. అందం, అభినయంతో రాణిస్తూ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న హైదరాబాదీ ముద్దుగుమ్మ శాన్వి పంచుకున్న ముచ్చట్లు..
మాఅమ్మానాన్న నాకు బిగ్గెస్ట్ చీర్‌లీడర్స్. నా డ్యాన్స్ క్లాసుల నుంచి సినిమా ఆడిషన్స్ వరకూ అన్ని విషయాల్లో వాళ్లు నాకు సపోర్ట్ చేశారు. శ్రీదేవి గారంటే చాలా ఇష్టం. నాగార్జున సార్ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన స్టయిల్ సూపర్‌గా ఉంటుంది. కథానాయిక సమంత నా ఇన్స్పిరేషన్. ఆమె వర్సటిలిటీ అద్భుతం!
నేను వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఒక హిస్టారికల్ డ్రామాలో నటించడం నా డ్రీమ్. నాట్యానికి ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలని ఉంది. ఫ్యాన్స్ నన్ను గుర్తుపట్టి సెల్ఫీ అడిగితే సంతోషంగా ఉంటుంది, కానీ కొంచెం బెరుకుగానూ ఉంటుంది.మొ
దట్లో నటనపై ఆసక్తి లేకపోయినా ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ సినిమా చేసిన తర్వాత యాక్టింగ్ పట్ల ప్యాషన్ పెరిగింది. ‘పిట్ట కథలు’ తర్వాత చాలా వెబ్‌సిరీస్ ఆఫర్స్ వచ్చాయి, కానీ, కరోనా కారణంగా అవిచేయలేకపోయాను. హైదరాబాద్ నాకు చాలా స్పెషల్. ఇక్కడి కల్చర్, ఫుడ్, ప్రజలు నాకు చాలా ఇష్టం.
చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. మా అమ్మమ్మ కథలు చెబుతుంటే నేను వాటిని డ్రామటిక్‌గా యాక్ట్ చేసేదాన్ని. డ్యాన్స్ అన్నా, డ్రామా అన్నా నాకు పిచ్చి. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నాను. సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఇష్టం. కా
లేజీ రోజుల్లో ఓసారి ఒక ఈవెంట్లో డ్యాన్స్ చేశాను. ఆ పెర్ఫార్మెన్స్ను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చూశారు. ఒక సీరియల్లో అవకాశం ఇచ్చారు. కానీ, రెండు ఎపిసోడ్స్ షూట్ చేశాక ఆ షో ఆగిపోయింది. సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ఫిల్మ్స్లో కూడా నటించాను. అలా సినిమా వైపు నా అడుగులు పడ్డాయి.పా
త్ర చిన్నదా పెద్దదా అని ఆలోచించడం కంటే, కథలో ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటాను. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఒక చిన్నపాత్రలో అవకాశం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో చిన్నపాత్రయినా సరే అదృష్టంగా భావించి ఒప్పుకొన్నా. ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి నన్ను ‘తమన్నా చెల్లిలా ఉన్నావు’ అన్నారు, అది నాకు పెద్ద కాంప్లిమెంట్.
దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో అనుబంధం ప్రత్యేకమైంది. ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్ ఆడిషన్లో ఆయన నన్ను ఎంపిక చేశారు. నా కెరీర్‌ను మలుపు తిప్పిన వ్యక్తి. అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో. విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వస్తే ఎప్పటికీ వదులుకోను.