పుస్తకంలేని ఇల్లు.. ఆత్మలేని శరీరం లాంటిది.
విలువల బాటసారి
‘ఇతను నావాడు. అతను పరాయివాడు. ఇది నాది, అది నీది అనే భావన సంకుచిత మనసు ఉన్నవారికే ఉంటుంది. ఉదార స్వభావులకు మాత్రం విశ్వమంతా ఒకే కుటుంబమన్న భావన ఉంటుంది. ఈ భావనకు చక్కని నిదర్శనం గూడపాటి సీతారామస్వామి గారి జీవితం’ అంటూ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వెలువరించిన అభిప్రాయం ‘నిలువెత్తు నిజాయితీ’కి ఆకాశమెత్తు ప్రశంస. గూడపాటి సీతారామస్వామిగారి సుదీర్ఘ జీవనయానానికి ఈ పుస్తకం అక్షర రూపం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి.. పట్టుదలతో చదువుకొని.. జూనియర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి.. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఇంజినీర్‌గా సేవలదించారు సీతారామస్వామి.
ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, లెక్కలేనన్ని ఊరింపులు, పట్టిలాగాలని చూసిన పక్కదార్లు. ఆ విలువల బాటసారి దేన్నీ లెక్కచేయలేదు. మడమతిప్పలేదు. దారి తప్పలేదు. ఆ సత్యనిష్ఠను చాటిచెప్పే సంఘటనలు ఈ పుస్తకంలో అనేకం. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆయన సమాజం కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. స్వగ్రామం పొట్టిపాడు అభివృద్ధికి తనవంతు కృషిచేశారు. ప్రాథమిక పాఠశాలకు కొత్త రూపం ఇచ్చారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు. తండ్రిగా, కుటుంబపెద్దగా కూడా ఆయనది సార్థక జీవనం. ‘మా నాన్న ఓ స్ఫూర్తి కేంద్రం. ఆయన ఆలోచనా విధానాలు గొప్ప జీవన సూత్రాలు’ అంటారు సీతారామస్వామి తనయుడు, సుప్రసిద్ధ హృద్రోగ నిపుణుడు డాక్టర్ గూడపాటి రమేశ్. బతుకు పరుగులో పడిపోయిన మనం జీవించడం బొత్తిగా మరిచిపోయాం. ‘నిలువెత్తు నిజాయితీ’ చదువుతున్నప్పుడు మనం ఏం కోల్పోయామో గ్రహిస్తాం. ఎలా తిరిగిపొందాలన్నదీ తెలుసుకుంటాం. చదివి పక్కన పెట్టాల్సిన పుస్తకం కాదు, గుండెలకు హత్తుకోవాల్సిన రచన ఇది.
నిలువెత్తు నిజాయితీ
రచన: పాలకోడేటి సత్యనారాయణ రావు
పేజీలు: 290 వెల: అముద్రితం
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
బుక్ షెల్ఫ్
వర్షం కురిసిన సముద్రం (కథలు)
రచన: సత్యం మందపాటి
పేజీలు: 164,
ధర: రూ. 200
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
ప్రతులకు:
ఫోన్: 85588 99478
కోసూరి ఉమాభారతి కథలు
రచన: కోసూరి ఉమాభారతి
పేజీలు: 140, ధర: రూ. 200
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
ఫోన్: 85588 99478
అస్తిత్వ వాచకం
రచన: బాలసుధాకర్
పేజీలు: 134, ధర: రూ. 150
ప్రచురణ: చంపావతి ప్రచురణలు
ప్రతులకు:
ఫోన్: 95056 46046