బెల్టు అంటే ఒకటే బకిల్ ఉండటం మనం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా బెల్టు చుట్టూ వాటిని డిజైన్ చేస్తే చూసేందుకు వెరైటీగా ఉంటుంది కదూ! అచ్చం అలాంటిదే ‘పోలో రాల్ఫ్ లారెన్ మెటల్ యాక్సెంట్ స్వేడ్ బెల్ట్’. లెదర్‌తో చేసిన ఈ బెల్టు.. చూసేందుకు వడ్డాణంలా అందంగా కనిపిస్తుంది.
దీని చుట్టూ సిల్వర్ రంగు మెటల్‌తో రూపొందించిన బకిల్స్లాంటి బిళ్లలు అమర్చి ఉంటాయి. దీంతో దీన్ని ఏ అవుట్ ఫిట్ మీద ధరించినా సాధారణ బెల్టు కన్నా భిన్నంగా, కొత్త లుక్‌ని ఇస్తుంది. జీన్సు మీదే కాదు, లూజ్ప్యాంట్లు, మిడి డ్రెస్‌లు, లాంగ్ ఫ్రాక్‌ల మీదా దీన్ని ఫ్యాషనబుల్‌గా ధరించవచ్చు. సుమారు రూ.63వేలు ఖరీదు చేసే ఈ బెల్టును ralphlauren.global వెబ్సైట్లో అమ్ముతున్నారు.