ఎక్స్చేంజ్ బోనస్.. క్యాష్‌బ్యాక్.. ఇలాంటి ఆఫర్ల కోసం చూస్తున్నవారి కోసమే.. ‘వన్ ప్లస్’ మస్త్
ఆఫర్‌తో ముందుకొచ్చింది. అదేంటంటే.. దేశంలో OnePlus 13R రూ. 42,999 ప్రారంభ ధరతో విడుదలైన విషయం తెలిసిందే. అయితే, అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ల ద్వారా.. దీన్ని రూ. 25,000 కంటే తక్కువకే పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవడం ద్వారా డబ్బు ఆదా చేయవచ్చు. ముఖ్యంగా, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు వెంటనే రూ. 3,000 తగ్గింపు పొందవచ్చు.
అదనంగా, ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మీ పాత ఫోన్‌ను మార్చుకొని, రూ. 36,500 వరకూ ధరను తగ్గించుకోవచ్చు. ప్రత్యేకతల విషయానికొస్తే.. OnePlus 13R సబ్-రూ. 50,000 సెగ్మెంట్లో అదిరే ఫీచర్లను అందిస్తున్నది. 6.78 అంగుళాల డిస్ప్లే, Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6,000mAh బ్యాటరీతో మీ అవసరాలకు తగ్గట్లు రోజంతా వస్తుంది. అధిక స్టోరేజ్ వేరియెంట్లలోనూ అందుబాటులో ఉంది. డిజైన్, పెర్ఫార్మెన్స్ పరంగా OnePlus 13R మంచి ఎంపిక. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే.. హాట్ సేల్ అని చెప్పొచ్చు.
-దొరికే చోటు: https://bit.ly/3CrV82P
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఏఐ’ ముచ్చటే. అవసరం ఏదైనా ఏఐ సాయం కోరుతున్నాం. అందుకే స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా ‘ఏఐ’ టెక్నాలజీని ఫోన్లలో మరింతగా మిళితం చేస్తున్నాయి. కావాలంటే.. ఒప్పో కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన రెనో 13 సిరీస్ ఫోన్లను చూడండి. ఇందులో రెనో 13 ప్రో 5G, రెనో 13 5G, రెనో 13 F మోడళ్లు ఉన్నాయి. అత్యాధునిక AI ఫీచర్లు.. సృజనాత్మకతను ప్రోత్సహించే AI లైవ్ ఫొటో.. AI ఎడిటర్ వంటి టూల్స్‌తో ఈ సిరీస్ ప్రత్యేకతను సంతరించుకుంది.
పటిష్ఠమైన IP66, IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో ఈ ఫోన్లు ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేస్తాయి. క్రియేటర్లు, గేమింగ్ ప్రేమికులు, సాధారణ వినియోగదారులు.. అందరి అవసరాలను తీర్చేలా వీటిని డిజైన్ చేశారు. డిజైన్, ఫీచర్ల విషయానికి వస్తే.. రెనో 13 ప్రో 5G మీడియాటెక్ డిమెన్సిటీ 8350 చిప్ సెట్‌తో రూపొందింది. 1.5K 120Hz OLED డిస్పే, 5,800mAh బ్యాటరీతోపాటు 80W SUPERVOOC ఫ్లాష్ చార్జింగ్ ఉంది.
ధర: రూ.54,999
దొరికే చోటు: https://bit.ly/4gV16s9
షియోమీ ట్యాబ్‌ల తయారీలోనూ తనదైన ముద్ర వేస్తున్నది షియోమీ సంస్థ. తాజాగా ప్యాడ్ 7ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది 11.2 అంగుళాల 3.2K డిస్ప్లేతో ఆకట్టుకుంటున్నది. Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్, 8850mAh బ్యాటరీ.. లాంటివి చాలా శక్తిమంతమైన ఫీచర్లు అనొచ్చు. వినియోగదారుల అన్ని అవసరాలు తీర్చేలా ఈ టాబ్లెట్‌ను అందిస్తున్నది షియోమీ కంపెనీ. 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్ప్లే.. సాఫ్ట్ లైట్ వెర్షన్.. గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి.
మరికొన్ని ప్రధానమైన ఫీచర్ల విషయానికి వస్తే.. షియోమీ ప్యాడ్ 7 అల్యూమినియం యూనిబాడీతో దృఢంగా, తేలికగానూ ఉంటుంది. 6.18mm మందంతో పోర్టబుల్‌గా, నాజూకుగా కనిపిస్తుంది. 45W టర్బో చార్జింగ్ స్పీడ్‌తో టాబ్లెట్ చాలా త్వరగా చార్జింగ్ అవుతుంది. Android 15 ఆధారిత HyperOS 2.0తో పనిచేస్తుంది. దీంట్లో ఏఐతో కంటెంట్ రాయొచ్చు. లైవ్ సబ్‌టైటిల్స్ వంటి ఆధునిక ఫీచర్లూ ఉన్నాయి. డాంగిల్ సపోర్ట్‌తో కీబోర్డు, మౌస్‌లను ట్యాబ్‌కి కనెక్ట్ చేసుకుని ల్యాపీలా వాడుకునే వీలుంది.
ధర: రూ. 27,999 (ప్రారంభ ధర)
దొరికే చోటు: https://shorturl.at/ n91Xo
స్మార్ట్‌వాచ్ మార్కెట్లో నాయిస్ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేలా.. కలర్‌ఫిట్ ప్రో 6 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కలర్‌ఫిట్ ప్రో 6 మ్యాక్స్, కలర్‌ఫిట్ ప్రో 6 మోడళ్లు ఉన్నాయి. కొత్త EN2 ప్రాసెసర్ ఆధారంగా రూపొందించిన ఈ స్మార్ట్‌వాచ్‌లు.. Nebula UI 2.0 ఇంటర్ఫేస్తో యూజర్లకు సరికొత్త అనుభూతినిస్తాయి. Android, iOS ఫోన్లతో BT v5.3 ద్వారా కనెక్ట్ అవుతాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ప్రో 6 మ్యాక్స్ మోడల్లో ఆకట్టుకునే 1.96-అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. 410×502 పిక్సెల్ రిజల్యూషన్. ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్ కూడా. స్విమ్మింగ్, జాగింగ్‌కి ఈ వాచ్ పూర్తి అనుకూలంగా ఉంటుంది. మరోవైపు, కలర్‌ఫిట్ ప్రో 6 మోడల్ తెర 1.85 అంగుళాలు. AMOLED డిస్ప్లే. 390×450 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తున్నది. AI సపోర్ట్‌తో ఆరోగ్య సమాచారం, వ్యాయామ చిట్కాల్ని కూడా అందిస్తుంది.
ధర: రూ. 4,199
దొరికే చోటు: https://shorturl.at/mLhpN