చేతి గడియారం స్మార్ట్ అయ్యి చాలాకాలమైంది. మల్టీపర్పస్ డివైజ్గానూ మారిపోయింది. అందుకే స్టయిలిష్‌గా ఉంటూనే.. జేబుకు చిల్లు పడకుండా ఉండాలని కోరుకునే వారికి బెస్ట్ డీల్ ఒకటి ఉంది. అదే ఈ Noise Twist స్మార్ట్‌వాచ్. ఇందులో 1.38 అంగుళాల రౌండ్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంది. దీని మెటాలిక్ ఫినిషింగ్ వాచ్‌కి ఒక అదిరిపోయే లుక్ ఇస్తుంది. హెల్త్ సూట్‌తో హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్, నిద్ర, స్ట్రెస్ లెవల్స్‌ను నిత్యం ట్రాక్ చేయొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడితే 2 రోజుల వరకు బ్యాకప్ లభిస్తుంది. 100 పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. వందకుపైనే వాచ్ ఫేసెస్ మార్చుకోవచ్చు. అంటే మూడ్‌ని బట్టి వాచ్లుక్ మార్చేయొచ్చు. దీనికి ఐపీ68 రేటింగ్ ఉంది.
నీటి చినుకులు, దుమ్ము, ధూళి నుంచి వాచ్‌కు పూర్తి రక్షణ ఉంటుంది.
ధర: సుమారు రూ. 2,000 (ఆఫర్లను బట్టి మారుతుంది).
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
జేబులో పట్టే మినీ థియేటర్!

స్మార్ట్‌ఫోన్ వాడకంలో ఇప్పుడు కొత్త ట్రెండ్.. ఫోల్డబుల్ ఫోన్స్. కానీ, అవి త్వరగా విరిగిపోతాయేమో!? బ్యాటరీ తక్కువగా ఉంటుందేమో!? అనే టెన్షన్ చాలామందిలో ఉంటుంది. ఈ అనుమానాలను Tecno Phantom V Fold 2 పటాపంచలు చేసేస్తుంది. ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు.. చేతిలో ఇమిడిపోయే మినీ ట్యాబ్ కూడా. ఏరోస్పేస్ గ్రేడ్ హింజ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తున్నది. మార్కెట్లో అత్యంత బలమైన ఫోల్డబుల్ ఫోన్‌గా నిలిచింది. మెయిన్ స్క్రీన్ 7.85 అంగుళాలు. 20Hz AMOLED డిస్ప్లే. ఫోల్డ్ చేసినప్పుడు 6.42 అంగుళాల 3D కర్వ్డ్ స్క్రీన్‌లా మారిపోతుంది. ఫోల్డబుల్ సెగ్మెంట్లోనే అతిపెద్ద 5750mAhబ్యాటరీ ఇందులో ఉంది. సర్కిల్ టు సెర్చ్, ఏఐ ఇమేజ్ కటౌట్ వంటి అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఫాంటమ్ వీపెన్ సపోర్ట్‌తో నోట్స్ రాసుకోవడం, డిజైన్ చేయడం చాలా ఈజీ. 50ఎంపీ మెయిన్ కెమెరాతో కలిపి మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. 12జీబీ ర్యామ్ ఉండటం వల్ల మెరుపు వేగంతో పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్ చేయడం చాలా స్మూత్.
ధర: రూ. 90,000 (ఆఫర్లను బట్టి మారుతుంది).
దొరుకు చోటు: అమెజాన్, ప్రముఖ మొబైల్ స్టోర్స్
మౌస్ కాదు.. అంతకు మించి!!

రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసేవారికి చేతి నొప్పి, వేళ్ల అలసట సహజం. మణికట్టుపైనా ఒత్తిడి పడుతుంది. పైగా.. సాధారణ మౌస్తో పెద్దపెద్ద ఎక్సెల్ షీట్లు, డిజైన్లు చేసేటప్పుడు ఖచ్చితత్వం లేకపోతే చిరాకు వస్తుంది. ఈ సమస్యలన్నిటికీ అల్టిమేట్ అండ్ అడ్వాన్స్డ్ సొల్యూషన్.. ఈ bottle Logitech MX Master4. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎర్గోనామిక్ వైర్లెస్ మౌస్. ఇందులో హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ టెక్నాలజీ ఉంది. దీంతో మీరు చేసే పనులకు, నోటిఫికేషన్లకు మౌస్ (వైబ్రేట్ అవుతూ) స్పందిస్తుంది. ఫలితంగా పీసీపై పనులు చకచకా అయిపోతాయి. యూఎస్బీ-సి డాంగిల్, బ్లూటూత్ రెండూ ఉన్నాయి. దీని వినూత్న డిజైన్ వల్ల చేయి చాలా నేచురల్ పొజిషన్లో ఉంటుంది. దీనికి థంబ్ స్క్రోల్ వీల్ కూడా ఉంది. దీంతో చేతి మణికట్టుపై ఒత్తిడి పడదు. టెక్ ప్రియులకు, ప్రొఫెషనల్స్‌కి ఇది ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్.
ధర: సుమారు రూ. 12,000
దొరుకు చోటు:అమెజాన్, లాజిటెక్ అధికారిక వెబ్సైట్
క్లీనింగ్ దోస్త్!!

సాధారణంగా కిచెన్ సింక్ దగ్గర డిష్‌వాష్ లిక్విడ్ బాటిల్ ఒకటి, స్పాంజ్ ఒకటి పెట్టుకుంటాం. ఇలా అన్నీ విడివిడిగా ఉండటం వల్ల సింక్ ఏరియా అంతా చిందరవందరగా కనిపిస్తుంది. పైగా, ప్రతిసారీ బాటిల్ తీసి సోప్ వేసుకోవడం కొంచెం శ్రమతో కూడిన పని. ఈ సమస్యకు సింపుల్, స్మార్ట్ సొల్యూషన్.. ఈ SWAPKART 2-ఇన్-1 సోప్ డిస్పెన్సర్. ఇది మీ క్లినింగ్ ప్రాసెస్‌ని ఈజీ చేసేస్తుంది. ఒకే యూనిట్లో లిక్విడ్ హోల్డర్, స్పాంజ్ హోల్డర్ రెండిటినీ పెట్టుకోవచ్చు. స్పాంజ్‌తో పైన ఒకసారి ప్రెస్ చేస్తే చాలు, సరిపడా లిక్విడ్ స్పాంజ్‌కి అందుతుంది. దీంతో లిక్విడ్ వృథా కాదు, పని కూడా వేగంగా పూర్తవుతుంది. దీనితోపాటు వచ్చే స్పాంజ్‌ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. దీని స్క్రబ్బింగ్ సైడ్ పాత్రలపై ఉన్న మొండి మరకలను స్క్రాచెస్ పడకుండా క్లీన్ చేస్తుంది. క్వాలిటీ మెటీరియల్‌తో తయారు కావడం వల్ల ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
ధర: సుమారు రూ.400
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్