దక్షిణాదిన వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చినా అదృష్టం కలిసిరాని అందాల తార నిధి అగర్వాల్. హైదరాబాద్‌లో పుట్టి, బెంగళూరులో పెరిగిన ఈ హాట్ బ్యూటీకి సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే అభిమానులు ఎక్కువ. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నది. హరిహర వీరమల్లు, రాజాసాబ్ లాంటి భారీ సినిమాలతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న నిధి పంచుకున్న కబుర్లు..
చిన్నప్పటి నుంచి కాస్త పీలగా ఉండేదాన్ని. చుట్టూ ఉన్న వాళ్లు లావుగా మారాలని సలహా ఇస్తుండేవాళ్లు. కరోనా సమయంలో పలు కారణాల వల్ల కాస్త బొద్దుగా అయ్యా. అది చూసి ‘ఎందుకిలా అయ్యావు?’ అని వాళ్లే తిరిగి కామెంట్ చేశారు. మనం ఎలా ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లు ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారని అప్పుడు అర్థమైంది.
మొదటి లాక్‌డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ కోసం సంతకం చేశా. ఆ సమయంలో కెరీర్ పరంగా ఎలాంటి గ్యాప్ లేదు. కొంతకాలానికి లాక్డౌన్ వచ్చింది. ఆ తర్వాత షూట్ మొదలుపెట్టి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. రెండోసారి కరోనా కారణంగా షూట్ ఆగిపోయింది. దాదాపు మూడున్నర సంవత్సరాలు
ఆ చిత్ర నిర్మాణం సాగింది. ఈ సినిమా చేసేటప్పుడు వేరే చిత్రాలకు సంతకం చేయొద్దని కాంట్రాక్ట్ ఉండటంతో గ్యాప్ వచ్చింది. నుంచి కాస్త పీలగా ఉండేదాన్ని. చుట్టూ ఉన్న వాళ్లు లావుగా మారాలని సలహా ఇస్తుండేవాళ్లు. కరోనా సమయంలో పలు కారణాల వల్ల కాస్త బొద్దుగా అయ్యా. అది చూసి ‘ఎందుకిలా అయ్యావు?’ అని వాళ్లే తిరిగి కామెంట్ చేశారు. మనం ఎలా ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లు ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారని అప్పుడు అర్థమైంది.
ప్రేక్షకులు ఎక్కువగా నా నుంచి గ్లామర్ పాత్రలు ఆశిస్తారు. నేను అలాంటి పాత్రలే ఎక్కువగా చేస్తానని అందరూ అనుకుంటున్నారు. కానీ, ‘రాజాసాబ్’ తర్వాత ప్రేక్షకులకు నాపై ఉన్న అభిప్రాయం తప్పకుండా మారుతుందని నమ్ముతున్నా. ఈ సినిమాలో నా రోల్ రెగ్యులర్ హాట్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది.
‘మైఖేల్ మున్నా’ సినిమా ఆడిషన్‌కి వెళ్తే దాదాపు 300 మందిలో అదృష్టం బాగుండి నేను సెలెక్ట్ అయ్యాను. ఆ సినిమా తర్వాతే నాగ చైతన్య ‘సవ్యసాచి’లో చాన్స్ వచ్చింది. అప్పట్నుంచి వరుస అవకాశాలు అందుకుంటున్నా.. అదృష్టం కలిసి రావడం లేదు. రాబోయే సినిమాలపై పూర్తి నమ్మకంతో ఉన్నా.
చిన్నప్పటి నుంచీ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. దీపికా పదుకొణెను చూసి నేనూ తనలా తెరపై కనిపించాలనుకున్నా. నేను చాలా మొండిదాన్ని. ఏదైనా కోరుకున్నానంటే అది జరిగి తీరాల్సిందే! ఆర్టిస్ట్ అవుతానని ఇంట్లో చెబితే, ‘అంత డ్రామా క్రియేట్ చేయకు. నువ్వు ఏది కావాలంటే అదే జరుగుతుంది’ అన్నారు. ‘డోంట్ వర్రీ. మేమంతా నీతో ఉంటాం. కెరీర్‌ని సీరియస్‌గా తీసుకో.. అలాగే ఎంజాయ్ చెయ్’ అని ఎంకరేజ్ చేశారు. అయితే ముందు బాగా చదువుకో అన్నారు. చదువు పూర్తయ్యాక ముంబయికి వెళ్లి రెండేళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా!
ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో నాకు పట్టింపులేం ఉండవు, అన్నీ తింటాను. కానీ, పొద్దున్నే చద్దన్నం తినడం చాలా ఇష్టం. రాత్రి మిగిలిన అన్నంలో నీరు లేదా మజ్జిగ పోసి పర్చిమిర్చి, ఉప్పు వేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌గా తింటాను. కన్నడలో దీన్ని కంజి అంటారు. ఇది అలవాటు కాకముందు రకరకాల ఫుడ్స్ ట్రై చేశాను, ఎగ్స్ కూడా తినేదాన్ని. చివరికి చద్దన్నం నా ఫేవరెట్ అయిపోయింది. ఇడ్లీ కూడా ఇష్టంగా తింటాను.