పండుగలంటే.. సొంతూళ్లలో వాలాల్సిందే! దూర ప్రయాణాలతో ప్రయాసలు పడాల్సిందే! ముఖ్యంగా మెడ నొప్పులతో బాధపడేవారికి నరకమే! మీ ఇంట్లో అలాంటి పెద్దవాళ్లు ఉంటే.. దండిగా ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ దిండు ఉండాల్సిందే! ‘స్లీప్’ కంపెనీ అత్యాధునిక ఫీచర్లతో తయారుచేసిన ‘స్మార్ట్ నెక్ మసాజర్ పిల్లో’.. అన్ని వయసులవారికీ కానుకగా అందించవచ్చు. ఇందులోని ప్రత్యేక ఫీచర్.. ‘మసాజ్’. ఈ దిండును మెడకు పెట్టుకుంటే చాలు.. అదే మర్దన చేసేస్తుంది. మెడ నొప్పులను మాయం చేస్తుంది. రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యం కలగకుండా చూస్తుంది. మరో ఫీచర్.. ‘హీట్ థెరపీ’. మెడకు సున్నితమైన వెచ్చదనాన్ని అందిస్తుంది. కండరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రూ.1,999 ధర పలికే ఈ స్మార్ట్ నెక్ మసాజర్ పిల్లో.. thesleepcompany.in వెబ్సైట్లో లభిస్తుంది.
కాంతులు పంచే దీపావళి.. కాలుష్యాన్నీ పెంచుతుంది. పటాకులు కాల్చడం ద్వారా ఏర్పడే శబ్ద, వాయు కాలుష్యాలు.. మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీకు ప్రియమైన వారు కూడా ఇలాంటి
సందర్భంలో ఇబ్బంది పడుతుంటారు. వారికి.. ఈ డైసన్ హెడ్ఫోన్లను కానుకగా అందించండి. గ్లోబల్ బ్రాండ్ డైసన్ సంస్థ.. ఐదేళ్ల పరిశోధన తర్వాత ఈ ప్రీమియం రేంజ్ హెడ్ఫోన్లను తీసుకొచ్చింది. అత్యద్భుతమైన ఆడియో క్వాలిటీతో శ్రావ్యమైన సంగీతాన్ని అందిస్తాయివి. నాయిస్ కాన్సిలేషన్ టెక్నాలజీతో పనిచేస్తూ.. బయటి శబ్దాన్ని వీసమెత్తు కూడా చెవిలోకి చొరబడనీయవు. లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఈ హెడ్ఫోన్లు.. 3 గంటల్లోనే పూర్తిగా చార్జ్ అవుతాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటల దాకా ఇష్టమైన మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. మరో విశేషం.. ఈ హెడ్ఫోన్లకు స్వచ్ఛమైన గాలిని అందించే కార్బన్ ఫిల్టర్లు కూడా అమర్చుకోవచ్చు. ఫలితంగా గాలి కాలుష్యం నుంచి కూడా బయటపడవచ్చు. ‘మైడైసన్’ యాప్ సాయంతో ఈ హెడ్ఫోన్లను స్మార్ట్‌ఫోన్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. రెండు వేరియంట్లలో లభించే ఈ హెడ్ఫోన్ల ధర రూ. 64,900. dyson.in వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
మీ సన్నిహితులు స్మార్ట్ – మీరు మరింత స్మార్ట్ అయితే.. ఈ దీపావళి గిఫ్ట్ మీకోసమే! భారత్‌కు చెందిన బోట్, నాయిస్ సంస్థలు సరికొత్త ఫీచర్లతో ‘స్మార్ట్ రింగ్’లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఫిట్నెస్ ట్రాకర్‌గా పనిచేసే ఈ ఇ-ఉంగరాలు.. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలనూ సేకరిస్తాయి. ఇందులో ఉండే సెన్సర్లు.. మీ ఫిట్నెస్, నిద్రకు సంబంధించిన డేటాను ట్రాక్ చేస్తాయి. వ్యాయామం, వాకింగ్ సమయంలో.. మీ స్టెప్ కౌంట్, నడిచిన దూరం, ఖర్చయిన కేలరీలు, హార్ట్‌బీట్, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు సహా అనేక ఆరోగ్య విషయాలను పర్యవేక్షిస్తాయి. మహిళల కోసం రుతుచక్రాలను ట్రాక్ చేసే సౌకర్యమూ వీటిలో ఉంది. ఆ సమాచారాన్ని స్మార్ట్ ఫోన్‌కు నోటిఫికేషన్, రిమైండర్ రూపంలో అందిస్తాయి. ద లూనా రింగ్ (నాయిస్) ధర రూ.14,999. స్మార్ట్ రింగ్ (బోట్) ధర రూ.8,999 నుంచి ప్రారంభం. boat-lifestyle.com, gonoise.com వెబ్సైట్లలో ఈ స్మార్ట్ రింగ్స్ లభిస్తాయి.
దీపావళి రోజు ఇంటికొచ్చిన అతిథులకు స్వీట్లు, స్నాక్స్ పెట్టకుండా ఉంటామా? అదే సమయంలో వారి బాగోగుల గురించి కూడా ఆలోచించాల్సిందే కదా! అయితే, చలికాలంలో నూనెలో వేయించినవి తినడం ఆరోగ్యానికి అంతమంచిది కాదు. అందుకే, మీ కిచెన్‌లోకి.. ఈ ఎయిర్ ఫ్రయర్‌ను ఆహ్వానించండి. నూనె ఎక్కువగా వాడకుండానే చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్‌ఫ్రై లాంటి టేస్టీ టేస్టీ వంటకాలను ఇది చిటికెలో సిద్ధం చేస్తుంది. ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ.. బొరోసిల్ ఈ డిజీ ఎయిర్ ఫ్రయర్‌ను తీసుకొచ్చింది. హైస్పీడ్ ఎయిర్ సర్క్యులేషన్ ఫార్ములాతో తక్కువ నూనెతోనే రుచికరమైన ఆహారాన్ని సిద్ధంచేస్తుంది. వేపుళ్లే కాదు.. ఆవిరి మీద ఉడికే వంటకాలనూ వండేస్తుంది. సంప్రదాయ వంటలతో పోలిస్తే.. ఇందులో నూనె వాడకం 90 శాతం దాకా తగ్గుతుంది. గ్యాస్ ఖర్చును సగానికి సగం తగ్గిస్తుంది. టచ్ కంట్రోల్ ఫీచర్‌తో వస్తున్న ఈ ఎయిర్ ఫ్రయర్ ధర.. రూ. 11,200. myborosil.com ద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు.