పుస్తక సమీక్ష
సమాజం మంచిగా ఉండాలని అందరం కోరుకుంటాం. మరి సమాజం మనం కోరుకున్నట్టు ఉండాలంటే వ్యక్తిగా ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటేనే సాధ్యం. అయితే, మంచి వ్యక్తులు మాత్రం మంచి కుటుంబాల నుంచే తయారవుతారు.
- పుస్తకంలేని ఇల్లు.. ఆత్మలేని శరీరం లాంటిది.
మంచి కుటుంబంతోనే..
సమాజం మంచిగా ఉండాలని అందరం కోరుకుంటాం. మరి సమాజం మనం కోరుకున్నట్టు ఉండాలంటే వ్యక్తిగా ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటేనే సాధ్యం. అయితే, మంచి వ్యక్తులు మాత్రం మంచి కుటుంబాల నుంచే తయారవుతారు. అలా పుట్టే ప్రతి ఒక్కరికీ మంచి కుటుంబ నేపథ్యం ఇవ్వాలనే సందేశంతో సి.ఎన్.చంద్రశేఖర్ వెలువరించిన కథా సంపుటి ‘ఆదివారం కథలు’. ఈ పదకొండు కథలూ దేనికదే ప్రత్యేకం. మొదటి కథ ‘చందూ’లో ప్రధాన పాత్ర తనకు పరిచయమైన ప్రతి ఒక్కరి బాగోగుల గురించి ఆలోచిస్తాడు. అలాంటి పాత్ర చుట్టూ రచయిత ఓ ప్రేమ కథ అల్లాడు. మరో కథ ‘సుందరం’లో ప్రధాన పాత్ర సాటి మనిషి క్షేమం కోసం తపిస్తాడు.
ఎదుటి వ్యక్తి కోణంలో ఆలోచిస్తాడు. మరో కథ ‘పెద్దన్నయ్య’ ఉమ్మడి కుటుంబాల్లో వ్యక్తులను తీర్చిదిద్దడం, జీవితంలో నిలబెట్టడంలో పెద్దన్నయ్యల పాత్ర గురించి వివరిస్తుంది. అలాంటి పెద్దన్నయ్యకే కష్టం వస్తే ఏం చేయాలో కండ్లకు కడుతుంది. మనుషుల్లో స్వార్థం ఎలా ఉంటుందో వివరిస్తూ రాసిన కథ ‘స్వాతిముత్యం’. పిల్లలకు ఏం నేర్పితే ఇల్లు అందమైనది అవుతుందో, తద్వారా ప్రపంచం మంచిగా మారిపోతుందో ‘నీరాజనం’ కథ తెలుపుతుంది. ‘కష్టపడి సంపాదించే భర్తే కావాలి’ అనుకునే ఓ యువతి ఆదర్శంతో ‘ఆశయాల పల్లకిలో…’ కథ నడుస్తుంది. ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన ఈ కథల్లోని పాత్రలు మన చుట్టూ కనిపించేవే. వీటిలోని పాత్రల నడక, సంభాషణల ద్వారా సి.ఎన్.చంద్రశేఖర్ కథలు మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తాయి.
ఆదివారం కథలు
రచన: సి.ఎన్.చంద్రశేఖర్
పేజీలు: 136, ధర: రూ. 180
ప్రచురణ: జయంతి పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్ 94923 78422
నా జ్ఞాపకాల్లో అమ్మ

అనువాదం: డా. కందేపి రాణీ ప్రసాద్
పేజీలు: 72
ధర: రూ. 100
ప్రచురణ: స్వాప్నిక్ ప్రచురణలు
ప్రతులకు:
ఫోన్: 98661 60378
జీవన సంధ్య

రచన: సుధామ
పేజీలు: 144, ధర: రూ. 120
ప్రచురణ: స్నేహిత స్రవంతి
ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలు
ఫోన్: 98492 97958
భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు

రచన: బి.ఎస్.రాములు
పేజీలు: 64, ధర: రూ. 50
ప్రచురణ: విశాల సాహిత్య అకాడమీ
ఫోన్: 83319 66987
…? చింతలపల్లి హర్షవర్ధన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

