మన సామెతలు
చేస్తున్న పనిని సక్రమంగా చేయకుండా.. మధ్యలో ఇంకో పనిని మొదలుపెట్టి, మరిన్ని కష్టాలు అనుభవిస్తున్న వాళ్లను ఉద్దేశించిన సామెత ఇది. తుంట బరువు తక్కువగా ఉంటుంది. మొద్దు.. తుంటెకు వందరెట్ల బరువెక్కువ. ‘రేయ్.. ఎన్ని తుంటెలని తీస్కపోతవ్ రా..
తుంటె దించి మొద్దు ఎత్తుకున్నట్టు
చేస్తున్న పనిని సక్రమంగా చేయకుండా.. మధ్యలో ఇంకో పనిని మొదలుపెట్టి, మరిన్ని కష్టాలు అనుభవిస్తున్న వాళ్లను ఉద్దేశించిన సామెత ఇది. తుంట బరువు తక్కువగా ఉంటుంది. మొద్దు.. తుంటెకు వందరెట్ల బరువెక్కువ. ‘రేయ్.. ఎన్ని తుంటెలని తీస్కపోతవ్ రా.. ఒక్కసారే మొద్దు ఎత్తుకో’ అని ఎవరో చెప్పిన మాట విని.. బలం చాలాకున్నా ఆ మొద్దును ఎత్తుకుని.. దాని కిందే పడి చచ్చాడట ఒకడు. ఇలాంటి స్వభావం ఉన్నవారికి చేస్తున్న పనిపై నమ్మకం ఉండదు. చెప్పుడు మాటలు వినో, ఆ కొద్దిపాటి కష్టాలను కూడా తట్టుకునే శక్తిలేకనో ప్రారంభించిన పనిని తుది వరకూ కొనసాగించరు. దాని వల్ల సమయం వృథాతో పాటు.. కొత్త కష్టాలను కొనితెచ్చుకోవడమే అవుతుంది. అందుకే, ఏ పనైనా మొదలు పెట్టేముందే, ‘మనం చెయ్యగలమా? లేదా?’ అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని పెద్దలు చెబుతారు.
వెయ్యేండ్లయినా చావు తప్పది.. వందేండ్లయినా వేరు తప్పదీ

మానవ సంబంధాలను ఒక్క మాటలో తేల్చి చెప్పిన సామెత ఇది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఒకే ఇంట్లో దాదాపు ఎనిమిది కుటుంబాల వరకూ కలిసే ఉండేవారు. అయితే, కొత్తగా వచ్చిన కోడళ్లకు ఆ బంధాలు, అనురాగాల గురించి తెలియకనో.. అత్త, తోటికోడళ్ల పోరు పడలేకనో వేరు పోయమని పోరు పెట్టేవారు. ఇలాంటి సందర్భాల్లో ఎవ్వరినీ నొప్పించక, ప్రేమ పూర్వకంగానే వేరుపోస్తూ ‘వెయ్యేైండ్లెనా చావు తప్పది.. వందేైండ్లెనా వేరు తప్పదీ. అందుకే మళ్లీ అంతా కలిసే ఉండాలి’ అంటుంటారు పెద్దలు. ఎన్ని వందల ఏండ్లు బతికినా మనిషిగా పుట్టినవాడికి చావు తప్పదు. ఉమ్మడిగా ఎన్ని వందల ఏండ్లు కలిసి ఉన్నా తుదకు విడిపోక తప్పదు. ఆ విడిపోవడం కూడా ప్రేమానుబంధాలను పెంచేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ సామెతలు
చెప్పారు జానపదులు.
వాడి గాశారం బాలేదయ్యా

కష్టాలలో కొట్టుమిట్టాడుతున్న వాడిని చూసి ‘వాడి గాశారం బాలేదయ్యా.. తాడే పామై కరుస్తుంది’, ‘ఏదన్నా పని మొదలు వెడదామంటే గాశారం బాలేదు’ అంటుంటారు కొందరు. ఈ పదబంధాల్లో గాశారం అంటే గ్రహచారం (గ్రహాల అనుకూలం) / అదృష్టం / జాతకం / తలరాత అనే అర్థాలు వస్తాయి. ఏ చిన్న పని మొదలుపెట్టినా తుదెల్లకపోవడం (పూర్తికాకపోవడం). అప్పటికే ఉన్న కష్టాలు సరిపోక, కొత్త బాధలు, ఇబ్బందులు తలెత్తడం. అలాంటి పరిస్థితుల్లో కొందరు ధైర్యం కోల్పోతారు. కష్టాన్నే నమ్ముకున్న వ్యక్తులు.. ఆ కష్టాల నుంచే రాటుదేలతారు, విజయం సాధిస్తారు. గ్రహచారం.. గాచారం/ గోచారం/ గాశారంగా జానపదుల నోళ్లలో నానుతూ ఉంటుంది. అయితే, ఏ పనైనా సరే గ్రహాల అనుకూలం, అదృష్టం, జాతకాలను నమ్ముకోకుండా తెలివితో, ఆలోచనతో, స్థిరమైన నిర్ణ యాలతో మొదలుపెట్టాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

