‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ బ్యూటీ మమిత బైజూ. వరుస అవకాశాలు అందుకుంటూ సక్సెస్ రేస్‌లో దూసుకుపోతున్నది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ని ఫిదా చేసిన ఈ అమ్మడు నటించిన డ్యూడ్, జననాయగన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో నటించింది. ఈ సందర్భంగా అమ్మకుట్టి పంచుకున్న కార్వాన్ కబుర్లివి…
మాది కేరళంలోని కొట్టాయం. నాన్న డాక్టర్. అన్నయ్య రాష్ట్రస్థాయి క్రికెటర్. నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ మా అన్నయ్యే తీసుకుంటాడు. నాకొచ్చే లవ్ ప్రపోజల్స్‌ను డీల్ చేయడంతో పాటు నాకొచ్చే పెండ్లి సంబంధాల్లోనూ ఆయన నిర్ణయమే ఫైనల్.
నా తొలి సినిమా ‘సర్వోపరి పాలక్కారన్’ అయినా, నాకంటూ గుర్తింపు తెచ్చింది మాత్రం ప్రేమలు చిత్రమే. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో పాటు నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ఇది. మలయాళి సినిమానే అయినా ఎక్కువ భాగం షూటింగ్ హైదరాబాద్‌లోనే చిత్రీకరించారు. అందుకే తెలుగు ప్రేక్షకులు దీన్ని ఎంతో ఆదరించారు.
నేను అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్‌ని. ఆయన నటించిన ఇద్దరమ్మాయిలు సినిమా అంటే నాకెంతో ఇష్టం. ఆ సినిమాలో బన్నీ ఉపయోగించిన వాచ్, ధరించిన టీషర్ట్స్, ఆయన ైస్టెల్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన మీదున్న అభిమానంతో ఆ ైస్టెల్‌ను కాపీ చేస్తుంటాను. ఇక కర సినిమా కోసం ధనుష్ ఎంతో కష్టపడ్డాడు. స్టార్ హీరో సూర్యతో కలిసి ప్రధాన పాత్రలో నటించడం గొప్ప అవకాశంగా భావిస్తాను.
సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. సెలెబ్రిటీ అనే కారణంతో నేను అడపాదడపాగా సోషల్‌మీడియాలో ఉండేదాన్ని. ప్రస్తుతం సోషల్‌మీడియాతో వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అది ఆచరణలో పెడుతున్నాను కూడా. ఇక నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మా పీఆర్ టీమ్ అందిస్తారు.
ఒక్క సినిమా వెనుక ఎంతోమంది కష్టం దాగుంటుంది. అది ఎప్పుడూ వృథా కాకూడదన్నది నా భావన. జన నాయగన్ లీకైన విషయం తొలుత నమ్మలేదు. సోషల్ మీడియాలో వినిపించేవన్నీ వాస్తవాలు కావని కొట్టిపారేశాను. ఉద్దేశపూర్వకంగా కొందరు ప్రచారం చేస్తున్నారనుకున్నా. కానీ, దురదృష్టవశాత్తు అదే నిజమైంది.