Vastu Shastra | గేటెడ్ కమ్యూనిటీలో కాంపౌండ్లు లేని ఇల్లు కొనవచ్చా?
ఇంటికి ఉత్తరం మధ్యలో మెట్లు పెట్టవద్దు. పైగా మీరు ఇంటి ఉత్తర భాగం కట్చేసి, ‘యు’ ఆకారంలో ఇంటిని కట్టి వాడుతున్నారు. దానివల్ల ఆర్థికంగా, ఆడపిల్లల పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అవసరాలకోసం ఇంటిని మూడు నాలుగు ఫ్లోర్లు కడుతూ.. భూమినుంచి నేరుగా ఫస్ట్ఫ్లోర్లోకి వెళ్లడానికి ఇష్టం వచ్చినట్టు ఓపెన్ మెట్లు కడుతున్నారు.
Vasthu Shastra | ఉత్తరం మధ్యలో మెట్లు పెట్టి, ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లవచ్చా? కింద పార్కింగ్ ఇచ్చాం.
– శ్రీనివాస్, సిద్ధిపేట.
ఇంటికి ఉత్తరం మధ్యలో మెట్లు పెట్టవద్దు. పైగా మీరు ఇంటి ఉత్తర భాగం కట్చేసి, ‘యు’ ఆకారంలో ఇంటిని కట్టి వాడుతున్నారు. దానివల్ల ఆర్థికంగా, ఆడపిల్లల పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అవసరాలకోసం ఇంటిని మూడు నాలుగు ఫ్లోర్లు కడుతూ.. భూమినుంచి నేరుగా ఫస్ట్ఫ్లోర్లోకి వెళ్లడానికి ఇష్టం వచ్చినట్టు ఓపెన్ మెట్లు కడుతున్నారు. తద్వారా ఇంటి గర్భస్థానం తెంపు జరుగుతున్నది. ఫస్ట్ఫ్లోర్లోకి వెళ్లాలంటే.. ఓపెన్ మెట్లను ఇంటికి వాయవ్యంలో నిర్మించి, ఉత్తరం బాల్కనీ నుంచి ఇంట్లోకి వెళ్లేలా కట్టుకోవాలి. లేదా రోడ్డును బట్టి తూర్పు – ఆగ్నేయంలో కూడా ఓపెన్ మెట్లు పెట్టి, తూర్పు నుంచి ఇంట్లోకి వెళ్లవచ్చు. ఎలివేషన్ కోసం ఇంటిని కట్చేసి, ఇంటికి ఉత్తరంలో, తూర్పు మధ్యలో మెట్లు పెట్టకూడదు. ఇల్లు కట్టేటప్పుడు ఏమీ అనదు. కట్టాక.. వదిలిపెట్టదు.
ఉత్తరం సింహద్వారం ఉండి, దక్షిణంలో రోడ్డు వచ్చి.. ఇంటికి తగులుతున్నది. అలా ఉండొచ్చా?
– ఎస్. నిర్మల, దోమలగూడ.
సింహద్వారం ఉత్తరం ఉండటం మంచిదే! అయితే, ఇల్లు వాస్తుకు ఉండటం వేరు. ఇల్లు ఉన్న లేదా అపార్ట్మెంట్ ఉన్న ప్రాంతం, దాని స్థితిగతులు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు చెప్పినట్టు దక్షిణం నుంచి రోడ్డు ఎదురుగా వచ్చి.. ఇంటికి తగలడం అనేది ఆలోచించాలి. ఆ రోడ్డు మనం ఉండే ఇంటికి దక్షిణం – ఆగ్నేయంలో పడితే దోషం లేదు.

కానీ, ఇంటికి దక్షిణంలో కానీ, దక్షిణ – నైరుతిలో కానీ, లేదా దక్షిణం ఎంత వెడల్పు ఇల్లు ఉందో అంత వెడల్పు రోడ్డు ఉండి, ఇంటికి తగులుతున్నట్లు అయితే మాత్రం.. అది దక్షిణం వీధిపోటుగా గుర్తించాలి. అది వీధి పోటా.. వీధి చూపా? అన్నది నిర్ధారణ చేసుకొని, ఆ ఇంటిని తీసుకోండి. కేవలం రోడ్డు ఎదురు వచ్చింది అని భయపడవద్దు. అలాగని జాగ్రత్తగా చూడకుండా అందులోకి చేరవద్దు.
మా ఇంటికి దక్షిణంవైపు ఎత్తుగా ఒక గుట్ట ఉంది. స్టాఫ్ కోసం దానిపై గదులు కట్టొచ్చా?
– వి.శకుంతల, బాసర.
ఇంటికి దక్షిణం – పడమర రాళ్లతో కూడిన ఎత్తుభాగం.. మీకు నైరుతిని పెంచుతూ ఉంది. మీరు ప్లానులో చూపినట్టు అది ఇంటి నుంచి కట్ చేయాల్సిన భాగం. కానీ, మీ ఆలోచన.. ‘నైరుతి ఎత్తుగా ఉంది కదా! అది మంచిది కదా! వాడుకోవాలి’ అనుకుంటున్నారు. కానీ, దానిని ఇంటినుంచి శాశ్వతంగా తొలగించాలి. కాబట్టి, అందులో స్టాఫ్ రూములు, ఆఫీస్ రూములు కట్టి వాడుకోవాలి అనుకోవద్దు. శరీరంలో చెడిపోయిన భాగాన్ని వైద్యులు తొలగిస్తారు కదా? అలాగే, ఇంటిలో పెరిగిన దిశలను ఎలా వాడాలి అనే ఆలోచన వద్దు. కట్ చేసినప్పుడే అన్ని విధాలుగా బాగుంటారు.
గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనాలి అనుకుంటున్నాం. కానీ, అందులోని ఇండ్లకు కాంపౌండ్లు లేవు. కొనవచ్చా? రోడ్లు పెద్దగా ఉన్నాయి.
– డి. అర్జున్, తార్నాక.
నిజానికి ఏ చోట ఇల్లు కట్టినా.. ఎంత ఆధునికంగా కట్టినా.. ఆ ఇంటికి కాంపౌండ్లు తప్పక ఉండాలి. కేవలం లేఅవుట్ చేసి, విశాలంగా రోడ్లు పెట్టి కట్టడం మంచిదే! కానీ, ఎప్పుడైతే ప్రహరీలు రావో.. ఆ ఇండ్లకు శక్తి చేకూరదు. వృద్ధి ఉండదు. అవి గాలిలో దీపాలు. కనీసం ఏ ఇంటికైనా దక్షిణం – పడమరలో తప్పక కాంపౌండ్లు కట్టాల్సిందే! మీరు ఎంచుకున్న ఇంటికి వాస్తుతోపాటు కాంపౌండ్లు కూడా ఉంటేనే కొనండి. లేదా కట్టించుకునే అవకాశం ఇవ్వమనండి. ఇల్లుకు ప్రధానంగా ప్రకృతి నుంచి రక్షణ కావాలి. పైగా దక్షిణం – పడమరలో ఉండే రోడ్లు ఎంత విశాలంగా, చూడటానికి అందంగా ఉన్నా.. ఆ స్థలమంతా ఆయా ఇండ్లకు ఖాళీ స్థలం కిందే పరిగణనలోకి వస్తుంది. రక్షణ లేని ఇల్లు – వాస్తులేని గృహం.. కేవలం అందంగా, ఖరీదుగా ఉంటే ఉపయోగం ఉండదు. చూసుకోండి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

