Vasthu Shastra | ఇంటి స్లాబ్ కింద చిన్న గుడి ఉంది. అలా ఉండటం మంచిదేనా?
భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంటి నిర్మాణం వారివారి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎవరు అడ్డుపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంటి తూర్పు ప్రహరీని ఎత్తులో కట్టుకున్నారా? అన్నది చెప్పలేదు.
Vasthu Shastra | తూర్పు వైపు కాంపౌండును ఎదురు ఇంటివాళ్లు చాలా ఎత్తుగా కట్టారు. మాకు మంచిదికాదు కదా? ఏం చేయాలి?
– ఎం. వసుంధర, కొండగట్టు.
భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంటి నిర్మాణం వారివారి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎవరు అడ్డుపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంటి తూర్పు ప్రహరీని ఎత్తులో కట్టుకున్నారా? అన్నది చెప్పలేదు. కానట్లయితే.. మీ ఇంటి కాంపౌండును మీరు సొంతంగా.. మీ స్థలం హద్దులోనే కట్టుకోండి. తద్వారా మన ఇష్టం వచ్చిన లెక్క ప్రకారం మనం కట్టుకోవచ్చు. మీకున్న తూర్పు కాంపౌండును ఆనుకొనే కట్టాలి. మూడు అంగుళాల ఖాళీ వదలాలి.
ఏడు అంగుళాల ఖాళీ వదలాలి అనేది వద్దు. ఖాళీ వదిలితే.. మూడు లేదా నాలుగు అడుగులు, మనిషి నడిచేలా ఖాళీ వదలాలి. కాబట్టి, మీరు ఎదుటి.. అంటే, మీ తూర్పు ప్రహరీని మీ పడమర కన్నా తక్కువ ఎత్తులో కట్టండి. ఎదుటివాళ్లది ఆనుకొని ఉన్నా దోషం కాదు. వాళ్లది వాళ్లకు ఎత్తుగా ఉన్నా.. మనదే మనకు వర్తిస్తుంది. మనం అలా మనదైన తూర్పు కాంపౌండు కట్టకుంటే మాత్రం మంచిదికాదు. మన హద్దే.. మనకు రక్ష.
ఆగ్నేయం ఎత్తు ఉండాలా? కిందికి ఉండాలా? ఎలా ఉంటే ఏంటి ఫలితం?
– బి. సత్య, కొంపల్లి.
ఇంటికి ఆగ్నేయం అనేది స్త్రీలమీద, ఇంటిలోని రెండో సంతానం మీద ప్రభావం చూపుతుంది. తూర్పు – ఆగ్నేయం చాలా ఇబ్బందులు కలిగించే సున్నిత స్వభావంతో ఉంటుంది. స్త్రీలది కూడా అలాంటి సున్నిత మనస్తత్వం కాబట్టి.. దానిని జాగ్రత్తగా, ఇంటి ఆవరణంలో సెట్ చేసుకోవాలి. అప్పుడే గృహం శాంతియుతం అవుతుంది. ఆగ్నేయం అంటే.. రెండు ప్లస్ రెండు కలిసి నాలుగు భాగాలుగా లెక్కించబడుతుంది. అంటే.. దక్షిణ – ఆగ్నేయంలో రెండు భాగాలు, తూర్పు – ఆగ్నేయంలో రెండు భాగాలు.
పూర్తిగా ఆ కోణం ఈశాన్యం కన్నా పల్లంగా ఉండకూడదు. అలాగే, వాయవ్యం దిశ కన్నాకూడా కిందికి ఉండవద్దు. దానివల్ల స్త్రీల ఆరోగ్య స్థితి, వారి మానసిక స్థితి దెబ్బతింటుంది. శత్రుస్థానం పెరుగుతుంది. స్త్రీలలో దుర్మార్గ ప్రవృత్తి పెరుగుతుంది. అలాగే, నైరుతికన్నా కూడా ఎత్తుగా ఉండకూడదు. వాయవ్యం – ఈశాన్యం దిశలకన్నా ఎత్తుగా ఉండాలి. అప్పుడు ఆర్థిక, ఆరోగ్యవృద్ధి ఉంటుంది.
మేము ఉండే ఇంటి స్లాబ్ కింద చిన్న గుడి ఉంది. అలా ఉండటం మంచిదేనా? ఆ గుడి చాలా పాతది.
– వి. లక్ష్మి, మోత్కూర్.
గుడి పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిలో పూజగది వేరు. జనమంతా వచ్చే గుడి వేరు. గుడిమీద ఇల్లు ఉండటం మంచిదికాదు. కాకపోతే.. ఇంటిమీద గుడి ఉండవచ్చు. దైవస్థానం అంత అశ్రద్ధగా నిర్మితం చేయకూడదు. గుళ్లు అన్నీ గొప్పగా వెలుగొందక పోవడానికి కారణం అదే! ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించని గుడి.. ప్రాణంలేని రబ్బరు బొమ్మలా ఉంటుంది. కాబట్టి, మీరు ఆ ఇంటిని ఖాళీ చేయండి. లేదా గుడిని మరోచోట శాస్ర్తోక్తంగా నిర్మితం చేయండి. ఎక్కడ పడితే అక్కడ దైవ నిర్మితాలు చేయడం మంచిదికాదు. గుళ్లు కట్టకున్నా దోషం కాదు కానీ, కట్టి.. ఆ విధంగా వదిలివేయడం, దానికి నిత్య పూజాదికాలు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి.
దక్షిణ దిక్కు దుకాణాలు పెట్టుకోవచ్చా? యజమాని ఎటు దిక్కు కూర్చోవాలి? గల్లా పెట్టె ఎటు ఉండాలి?
– సిహెచ్. కృష్ణకాంత్, మోత్కూర్.
దక్షిణం దిశ వ్యాపారానికి చక్కని స్థానం. దానిని తక్కువగా చూడకూడదు. సృష్టిలో పనికిరాని మొక్క లేనట్టు.. మనల్ని కష్టపెట్టే దిశలు లేవు. వాడకం తెలియక, వాటిలో వేడుకలకు మనం దూరం అవుతున్నాం. దక్షిణం దిశ దుకాణాలు పెట్టుకునేవారు.. ఆ దుకాణంలో నైరుతి భాగాన గద్దె కట్టుకొని లేదా టేబుల్ చైర్ వేసుకొని, తూర్పుగా ముఖం పెట్టి చూస్తూ వ్యాపారం చేయాలి. లాకర్ (గల్లా పెట్టె)ను కుడిచేతివైపు పెట్టుకోవాలి. అలాగే, దక్షిణం వెడల్పు కొలతలో దక్షిణ – నైరుతి భాగాన్ని లెక్కించి, అంతమందం గ్లాస్‌తో కొంత ఎత్తువరకు మూసి వాడుకోవాలి. వినియోగదారులు రావడానికి, దక్షిణ – ఆగ్నేయం గుండా వచ్చేలా అనుకూలమైన మెట్లు కట్టి నడుపుకోవాలి. దుకాణాలను ఉదయమే ముహూర్తకాలంలో ఓపెన్ చేసి, పూజ చేసి వ్యాపారం మొదలుపెట్టాలి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

