Vastu Shastra | కొడుకులు పుట్టకపోవడానికి ఇంటి దోషాలు కారణం అవుతాయా?
మట్టి మహిమ.. మనిషి ఊహకు అందనిది. ఎందుకంటే ఆ మనిషి తలలు కూడా ఈ మట్టిలోంచే కదా పుట్టుకొచ్చినవి. కొన్ని ప్రదేశాలు, కొన్ని చీకటి గృహాలు, కొన్ని వాతావరణ పరిస్థితులు వ్యక్తులను పెనుమార్పులకు గురిచేస్తాయి.
ఆడపిల్లల బాధలకు – కొడుకులు పుట్టకపోవడానికి కూడా ఇంటి దోషాలు కారణం అవుతాయా?
– వి. నీలిమ, కుషాయిగూడ
Vastu Shastra | మట్టి మహిమ.. మనిషి ఊహకు అందనిది. ఎందుకంటే ఆ మనిషి తలలు కూడా ఈ మట్టిలోంచే కదా పుట్టుకొచ్చినవి. కొన్ని ప్రదేశాలు, కొన్ని చీకటి గృహాలు, కొన్ని వాతావరణ పరిస్థితులు వ్యక్తులను పెనుమార్పులకు గురిచేస్తాయి. దిశలు లేని, కొలతలు కోణంగా పెరిగి, గాలీ వెలుతురూ సరిగ్గాలేని ఇండ్లలో.. కొందరు సంతానానికి దూరమవుతారు. ఈశాన్యం వికృతంగా తెగిపోయి, ఆగ్నేయం పెరిగిన గృహాలలో ఆడపిల్లలు అవస్థలు పడుతుంటారు.
కేవలం నీడను ఇచ్చే ఇల్లు ఉంటే సరిపోదు. అది ఆరోగ్య ప్రదాయినిగా కూడా అయి ఉండాలి. నలుదిశలు చక్కని వాతావరణంలో అమరి ఉండాలి. అప్పుడే వంశాభివృద్ధి జరుగుతుంది. పుత్ర సంతానం కలగకపోవడానికి కేవలం ఇప్పుడు ఉన్న ఇల్లే కాదు.. ఏళ్లుగా ఈశాన్యం, నైరుతి లోపాలు ఉన్న ఎన్ని ఇళ్లలో మీరు నివాసం చేసి ఉంటారో అన్నీ కారణమే. స్త్రీల ఇబ్బందులకు దక్షిణం – ఉత్తరం – ఆగ్నేయ భాగాల్లో వక్రతలు దోహదం చేస్తాయి. ఏది ఏమైనా, వాస్తురీత్యా మంచి ఇంట్లో ఉండటం.. మనిషికి చాలా అవసరం.
మాది దక్షిణం రోడ్డు. ఆగ్నేయంలో ఆఫీసు పెట్టుకోవచ్చా? పడమర షెడ్లు వేశాం. మేము పంపిన ప్లాన్ చూడగలరు.
– బి. జనార్దన్, కుకునూర్‌పల్లి
మొత్తం స్థలంలో దక్షిణం – నైరుతి యజమాని స్థానం అవుతుంది. మీరు షెడ్లు పడమర వేసి, ఆగ్నేయంలో మీ ఆఫీసు కట్టుకున్నారు. పడమరలో షెడ్లు వేసి, దక్షిణం వైపు చాలా ఖాళీ వదిలేశారు. దక్షిణం కాంపౌండుకు, షెడ్లకు మధ్య దాదాపు అరవై ఫీట్ల ఖాళీ స్థలం ఉంది. అంటే, మీరు రోడ్డుకు దగ్గరగా, దక్షిణ – ఆగ్నేయం గేటు వద్ద.. తూర్పు వైపు వేవింగ్ మిషిన్ (కాంటా) పెట్టుకొని, రెండు అంతస్తుల్లో ఆఫీసు గది కట్టారు. దానికి పడమర భాగమంతా ఖాళీ స్థలమే ఉంది. అది పెద్ద దోషం అవుతుంది. అంటే, దక్షిణ – ఆగ్నేయం ఆఫీస్‌ను పెట్టడం మంచిదికాదు. వెంటనే మీ ఆఫీస్‌ను దక్షిణ – నైరుతిలో కట్టుకోండి. ఉన్న ఆఫీస్‌ను మీ మేనేజర్‌కు ఇవ్వండి. నైరుతిలో ఖాళీ కాకుండా యజమాని స్థానం (ఎండీ) ఉండటం ఎంతో గొప్ప ఫలాన్ని అందిస్తుంది. లోపాన్ని సరిచేసుకోండి.

మా స్థలం ఉత్తరానికి పదిహేను డిగ్రీలు తిరిగింది అంటున్నారు. దానిలో ఇల్లు కట్టొచ్చా? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని తిప్పి కట్టుకోవచ్చా?
– ఎస్. శివాని, ములుగు
ఇలా సరిగ్గా దిశ కుదరని స్థలంలో ఇంటిని దిశకు అనుకూలంగా తిప్పి కట్టకూడదు. దిశానుకూలంగా స్థలాన్ని.. అంటే, ఇంటి స్థలాన్ని తిప్పినట్లయితే, కేవలం ఈశాన్యం మాత్రం స్థలం పెరుగుతుంది. కానీ, నైరుతి – ఆగ్నేయం – వాయవ్యం వైపుకూడా స్థలం పెరిగి, తీవ్రమైన చెడు ఫలితాలు వస్తాయి. మీరు మీ స్థలానికి ఉత్తరం పదిహేను డిగ్రీలు మాత్రమే తిరిగింది అంటున్నారు.
కాబట్టి, యథావిధిగా స్థలాన్ని తిప్పకుండా, కేవలం మూలమట్టాలు చూసుకొని, సమచతుర్భుజంగా కానీ, దీర్ఘచతురస్రంగా కానీ సెట్ చేసుకోండి. తరుగు స్థలాన్ని వదిలేయండి. అందులో యథావిధిగా అదే రోడ్డు దిశకు ఉత్తర ముఖద్వారంతో ఇల్లు కట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ ద్వారం పెట్టకండి. తూర్పు – ఉత్తరం ద్వారాలను పూర్తి ఈశాన్యానికి చేర్చి పెట్టండి. మంచి ఫలితాలు అందుకుంటారు. కాస్త శాస్త్రం బాగా తెలిసిన వారి సలహాలు తీసుకొని ఇల్లు కట్టుకోండి. తప్పు జరగకూడదు.

మాది కోళ్లఫారం. మొత్తం ఇంటిమీద నీళ్ల ట్యాంక్ కట్టాం. ఇలా ఉండొచ్చా?
– బి. రమేశ్, హుస్నాబాద్
ఇంటి మీద నీళ్ల ట్యాంక్ ఉండొచ్చు. కానీ, ఇంటి పైభాగాన్నే నీళ్ల ట్యాంక్‌గా మార్చుకోవడం మంచిదికాదు. స్లాబ్‌మీద నైరుతిలో నీళ్ల ట్యాంక్ పెట్టుకోడాన్ని శాస్త్రం అంగీకరిస్తుంది. అంతేకానీ, స్లాబ్ మొత్తానికి మొత్తం నీళ్ల ట్యాంక్ సరైనది కాదు. నెత్తిమీద మొత్తం నీళ్లు పెట్టుకోవడం తప్పు. పంచభూతాలు ఎక్కడైనా సమపాళ్లలో ఉండాలి. అప్పుడే ఆ గృహం సంపూర్ణం అవుతుంది. మీ ఇంటి అవసరాల కోసం ఒక నీళ్ల ట్యాంక్ పెట్టుకోండి. మీ కోళ్ల ఫారానికి కావాల్సిన నీళ్ల ట్యాంక్‌ను మొత్తం మీ స్థలంలో నైరుతిలో కట్టుకోండి. అప్పుడు, ఆ ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి మీ ప్లాంట్‌కు నీటిని సరఫరా చేసుకోండి. ఖర్చు తగ్గుతుంది కదా అని వాస్తుతో ప్రయోగాలు చేయవద్దు. ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

