శుభవాస్తు
మీ కర్మఫలాన్ని బట్టే.. మీరు సరైన ఇంటికో, దిక్కుమాలిన ఇంటికో వస్తారు. కర్మ అంటే.. పని. గత జన్మలో చేసిన పనులను, వాటి ఫలాలను (సంచితాలు) వెంటపెట్టుకొనే.. ఈ నేలపై మనిషి పుడతాడు. గత పనుల స్వభావాలు వ్యక్తి ఆలోచనల్లో నిక్షిప్తమై ఉంటాయి.
- కర్మఫలం – వాస్తుఫలం ఒకటిగానే ఉంటాయా?
– కె. కిరణ్‌కుమార్, నల్గొండ
మీ కర్మఫలాన్ని బట్టే.. మీరు సరైన ఇంటికో, దిక్కుమాలిన ఇంటికో వస్తారు. కర్మ అంటే.. పని. గత జన్మలో చేసిన పనులను, వాటి ఫలాలను (సంచితాలు) వెంటపెట్టుకొనే.. ఈ నేలపై మనిషి పుడతాడు. గత పనుల స్వభావాలు వ్యక్తి ఆలోచనల్లో నిక్షిప్తమై ఉంటాయి. అంటే, అతని నిర్ణయాలు కూడా మనస్సు – బుద్ధిని అనుసరించి ఉంటాయి. ఆ విధంగా ఒకచోట – ఒక దిశలో.. ఒక ప్రాంతాన్ని ఎంచుకొని, స్థలం కొనడమో, ఇల్లు కొనడమో చేస్తారు. ఆ విధంగా చేరిన ఇంటి ప్రభావం వారి మీద ఉంటుంది. ఈ దశలోనే సరైన శాస్త్రవేత్త అవసరం తప్పకుండా ఉంటుంది. అతని స్వభావ, నిర్ణయాలను నెగెటివ్ ధోరణి ప్రభావితం చేయకుండా.. దారి మళ్లించి, చక్కని గృహాన్ని సిఫారసు చేయాల్సి ఉంటుంది. సొంత నిర్ణయాలు లేకుండా సరైన గృహం ఎంచుకుంటే.. ఎంతో మంచిది. మనిషి తన మనసును అనుసరించకుండా, శాస్త్రం ప్రకారమే నడుచుకోవాలి. అప్పుడే దుష్ఫలితాల బారినుంచి బయటపడతాడు. అంటే.. కర్మ ఫలాలు బాగుంటాయి. గోదాం షెడ్లు తూర్పు హద్దు వరకూ వేశాం..
- ఫరవాలేదా? మాది జిన్నింగ్ మిల్లు.
– జి. మోహన్‌రెడ్డి, చేర్యాల
ఒక క్షేత్రంలో ఫ్యాక్టరీ అయినా, ఇల్లు అయినా శాస్త్ర పరంగా నిర్మాణం చేయాలి. ముందుగా ఏది ఎక్కడ రావాలో నిర్ణయించుకొని, ‘లే అవుట్’ చేయాలి. మీ జిన్నింగ్ మిల్లు ప్లాన్ చూశాను. మీ ఆఫీస్ స్థానం బాగానే ఉంది. కానీ, దక్షిణంలో వేసిన షెడ్ల కన్నా.. ఉత్తరంలోని రెండు షెడ్లు తూర్పు హద్దును తాకుతూ ఉన్నాయి. తూర్పు ప్రహరీకి – ఈశాన్యంలోని ప్రహరీకి.. షెడ్డుకు ఖాళీ లేనే లేదు. తద్వారా ఈశాన్యం మూతపడింది. ఉత్తరం – తూర్పు ఖాళీ లేకుండా పోయింది. తూర్పు ఈశాన్యం – ఉత్తర ఈశాన్యంలో.. దక్షిణం కన్నా ఎక్కువ ఖాళీ వచ్చేలా షెడ్లు కుదించండి. దక్షిణం షెడ్లతో సమానంగా.. ఉత్తరం షెడ్లు ఉండవచ్చు. పడమర పారు బాగానే ఉంది. తూర్పు ఖాళీ తప్పనిసరి అవసరం.
- ఇల్లు కట్టేముందు ఆ స్థలంలో మట్టిని తవ్వి తీసేయాల్సి ఉంటుందా? మా స్థలంలో పాత నిర్మాణం ఉంది. ఏం చేయాలి?
– బి. పద్మ, ఎల్బీ నగర్
స్థలశుద్ధి విషయంలో జాగ్రత్తలు అవసరమే. ఏ విధమైన గుండ్లు, రాళ్లు లేకుండా.. చక్కగా మట్టితో కూడిన జాగా అయినప్పుడు.. స్థలాన్ని తవ్వి, మట్టిని తీయాల్సిన అవసరం లేదు. కానీ, పాత ఇల్లు ఉంది కదా! ఆ నిర్మాణాన్ని తొలగించి, అందులో కొత్త ఇల్లు కట్టేటప్పుడు తప్పకుండా పాత ఇంటి అవశేషాలు, రాళ్లు, పునాదులు, పిల్లర్లు (స్టీల్‌తో సహా) తొలగించాల్సి ఉంటుంది. పెద్ద చెట్ల వేర్లు ఇంటి నిర్మాణానికి అడ్డుగా వస్తాయి. అలాగే పాత ఫుటింగ్ ఉంటే.. కొత్త ఇంటి నిర్మాణం సరిగా చేయలేం. బొగ్గు శాతం ఎక్కువ ఉండే సొరికలు బయటపడితే.. తగు జాగ్రత్తలు తీసుకొని, ఇంటి నిర్మాణం చేయాలి. బొమికలు, బొగ్గు నిలువలు, శ్మశానవాటిక అవశేషాలు బయటపడితే.. ఆ చోటు నివాస గృహానికి పనికిరాదు. ఇంటికి – గుడికి తేడా లేదు. కాబట్టి స్థల శుద్ధి చాలా అవసరం.
- ద్వారాలు నిలబెట్టినప్పుడే పాలు పొంగించవచ్చని అంటారు. నిజమేనా?
– డి. మురళి, మోర్తాడ్
గృహ నిర్మాణం నేపథ్యంలో గోడలు కట్టాలంటే.. ముందుగా ద్వారబంధాలు (ఫ్రేములు) పెట్టి, వాటిని గుండుకు నిలబెడతారు. ఇంటి ఆడ పిల్లతో గడప కడిగించి, పూజ జరిపిస్తారు. ఆ తరువాత ఆ ద్వారంలోంచి నడుస్తారు. ఈ ద్వార నిర్ణయాన్ని ముహూర్తం చూసే చేస్తారు. ఇక పాలు పొంగించడం అనే సంప్రదాయం ఈ సమయంలో రానేరాదు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత ‘గృహ ప్రవేశం’ అనే పెద్ద ఉత్సవంలో అదొక క్రతువు. అది వంటగది పూర్తి అయినాక, అందులో జరిపించా ల్సిన కార్యక్రమం. దానికి సమయం ఉంది. అంతేకానీ, ద్వారం నిలబెట్టే రోజు పాలు పొంగించకూడదు. ఒకేసారి పని ఒడిపించుకోవడం లాంటిది అది. భూమిపూజకు.. స్లాబుకు.. ద్వారం నిలబెట్టడానికి.. గృహ ప్రవేశానికి ప్రత్యేకమైన ముహూర్తాలు ఉంటాయి. ఆ నియమాలు కచ్చితంగా పాటించాలి. బారసాల
– పంచెకట్టే పండుగ ఒకే రోజున చేయం కదా!?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

