నడిచొచ్చిన న్యాయం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అత్యంత చరిత్రాత్మక నిర్ణయాల్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒకటి. ఇది ప్రాంత ప్రజలపై ప్రేమ ఉన్న ఒక్క ముఖ్యమంత్రి నిబద్ధతతో, దూరదృష్టితో, విజ్ఞతతో ఆలోచించి తీసుకున్న ఒక మంచి నిర్ణయం.
న్యాయం పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, ఆ హక్కును వినియోగించుకోవడం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు న్యాయస్థానాలను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన… ఇక్కడి ప్రజల స్వపరిపాలన ఆకాంక్ష నుంచి పుట్టింది. ఆ అపేక్ష నెరవేరిన క్రమంలో పరిపాలన ప్రజల చెంతకు రావడం ఎంత ముఖ్యమో న్యాయం కూడా ప్రజల గడపకు చేరడం అంతే ముఖ్యం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అత్యంత చరిత్రాత్మక నిర్ణయాల్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒకటి. ఇది ప్రాంత ప్రజలపై ప్రేమ ఉన్న ఒక్క ముఖ్యమంత్రి నిబద్ధతతో, దూరదృష్టితో, విజ్ఞతతో ఆలోచించి తీసుకున్న ఒక మంచి నిర్ణయం.
న్యాయ వ్యవస్థ విస్తరణ
జిల్లాలు పెరిగితే కేవలం కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థ కూడా విస్తరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 10 పాత జిల్లాలకు మాత్రమే జిల్లా కోర్టులు ఉండేవి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులు, సిటీ సివిల్ కోర్టులతో కలిపి 9 జిల్లా కోర్టులు మాత్రమే ఉండేవి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రజలకు న్యాయం అందుబాటులోకి తేవడం కోసం తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును సంప్రదించింది. రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా న్యాయ జిల్లాలను (Judicial Districts) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ఫలితంగా 2022 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సమక్షంలో 32 కొత్త న్యాయ జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 33 రెవెన్యూ జిల్లాలకు సమానంగా 33 జ్యుడీషియల్ జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రతి కొత్త జిల్లాలో ప్రధాన జిల్లా-సెషన్స్ జడ్జి (Principal District & Sessions Judge), సీనియర్ సివిల్ జడ్జి కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి, చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జిల కోర్టులు మంజూరయ్యాయి. దీంతో పాటు 23 కొత్త జిల్లా న్యాయ సేవా సంస్థలు (DLSA – District Legal Services Authority) కూడా ఏర్పడ్డాయి.

Kcr Judicial
ఉపాధి వరం
ఈ నిర్ణయం వల్ల అత్యధికంగా లాభపడింది జూనియర్ న్యాయవాదులు. నూతన జిల్లాల ఏర్పాటుతో కొత్తగా జిల్లా సెషన్ కోర్టులు మంజూరు కావడం వల్ల న్యాయం కూడా ప్రజలకు దగ్గరైంది. చాలామంది జూనియర్ న్యాయవాదులకు లాభం జరిగి మంచి నైపుణ్యం కల న్యాయవాదులుగా వృత్తిలో నిలదొక్కుకునేందుకు అవకాశం లభించింది. ప్రతి జిల్లాలో 30-50 మంది న్యాయవాదులకు సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం వచ్చింది. అడిషనల్ జిల్లా కోర్టులుగా ఉన్నవి పూర్తి స్థాయి జిల్లా కోర్టులుగా అప్‌గ్రేడ్ కావడంతో వారికి సెషన్స్ కేసులు, సివిల్ కేసులు వాదించే అనుభవం లభించింది.
కొత్త కోర్టులు ఏర్పాటు కావడంతో నూతన జడ్జీల నియామకం, పదోన్నతులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రభుత్వ ప్లీడర్లు ఇలా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. దీంతోపాటు ప్రతి జిల్లా కోర్టుకు స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, అటెండర్లు, ప్రాసెస్ సర్వర్లు, రికార్డ్ అసిస్టెంట్లు ఇలా సుమారు 40-60 మంది సిబ్బంది అవసరం. 23 కొత్త జిల్లాలకు లెక్కేస్తే దాదాపు 1000-1500 ప్రత్యక్ష ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. దీనికి తోడు జిరాక్స్, టైపింగ్, స్టాంప్ వెండర్లు, క్యాంటీన్లు లాంటి పరోక్ష ఉపాధి అవకాశాలు ప్రతి జిల్లా కేంద్రంలో పెరిగాయి.
ప్రారంభంలో కొత్త కోర్టులు తాత్కాలిక భవనాల్లో, అద్దె భవనాల్లో నడిచాయి. తర్వాత ప్రభుత్వం శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాల పునర్విభజన కేవలం పరిపాలనా సంస్కరణ మాత్రమే కాదు, అది సామాజిక న్యాయ సంస్కరణ. పాలన, న్యాయం ప్రజల గడప వద్దకు రావాలనే తెలంగాణ సాధన ఆకాంక్షకు ఇది నిదర్శనం. కొత్త కోర్టులు ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు కోర్టులు అందుబాటులోకి వచ్చాయి. త్వరితగతిన న్యాయం జరిగే అవకాశం ఏర్పడింది. ఈ ఆనవాళ్లను తొలగించే ధైర్యం ఎవరైనా చేయగలరా? న్యాయవ్యవస్థలో కేసీఆర్ తెచ్చిన విప్లవాత్మక మార్పుగా దీనిని చెప్పవచ్చు. పాలన అంటే ఇది అని నిరూపించిన నాయకుడు కేసీఆర్. దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపారు. న్యాయం పొందడం రాజ్యాంగ హక్కు అయితే, ఆ హక్కును ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత మాత్రం కేసీఆర్‌కే దక్కుతుంది.
పెండింగ్ కేసులు కొత్త జిల్లాలకు బదిలీ కావడంతో పాత కోర్టులపై భారం తగ్గింది. కేసుల పరిష్కారం వేగవంతమైంది. న్యాయం త్వరితగతిన జరిగేలా అవకాశం ఏర్పడింది. కొత్త జిల్లా న్యాయసేవ సంస్థలు (DLSA) ఏర్పడటంతో గ్రామ స్థాయిలో న్యాయ అవగాహన సదస్సులు, ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్‌లు ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించడం సాధ్యమైంది.
– తన్నీరు శ్రీరంగారావు, న్యాయవాది, మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

