Anchor Anasuya Bharadwaj | వర్షాకాలం వచ్చేసింది. చల్లగాలులు వీస్తున్నాయి. సాయంత్రాలు చిరుజల్లులు పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడి బజ్జీలు, పకోడీ, సమోసాలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడతారు చాలామంది. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.
యాంకర్‌గా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, సినిమా ఆర్టిస్ట్‌గా మారి మంచిమంచి పాత్రలతో ఆకట్టుకుంటున్నది అనసూయ. వర్షాకాలంలో వేడివేడి మిర్చీబజ్జీ, పునుగులు తినేందుకే తను ఇష్టపడుతుందట. ‘.. అదో అదిరిపోయే కాంబినేషన్’ అంటున్నది అనసూయ. కానీ, డైటింగ్ కారణంగా ఈ సంవత్సరం ఆ రుచులకు దూరంగా ఉండాల్సి వస్తున్నదట. అంతేకాదు ఈ వర్షాకాలంలో కొత్తగా ఆల్మండ్ మిల్క్‌తో చేసే కాఫీ ట్రై చేయాలని అనుకుంటున్నదట రంగమ్మత్త!
“Anasuya Bharadwaj | రెడ్ కలర్ శారీలో అనసూయ భరధ్వాజ్ ఒంపుసొంపులు..”