LED Curtain Lights | కర్టెన్స్‌ను ఇకపై ఇలా మెరిపించండి
LED Curtain Lights | ఇంటిని ఎంత అందంగా కట్టుకున్నా, అందులో ఎంత ఖరీదైన ఫర్నిచర్ అమర్చుకున్నా… స్వాగతం పలికే ద్వారాలకు, గాలిని విసిరే కిటికీలకు ముచ్చటైన తెరలు లేకపోతే ముస్తాబు పూర్తికానట్టే. వాల్ స్టిక్కర్లు, వార్డ్ రోబ్‌లు ఎన్నున్నా ఇంటి అలంకరణలో పరదాలదీ ప్రధాన పాత్రే. అందుకే ఇప్పుడు తెరలకూ ఎల్యీడీ కర్టెన్ లైట్లు వస్తున్నాయి.
కొందరు ఇంటి అలంకరణలో భాగంగా లైట్లను వినియోగిస్తే, మరికొందరు పండగలకో పబ్బాలకో ఎల్యీడీ దీపాల వరుసలు పేర్చి మురిసిపోతారు. సందర్భం ఏదైనా కాంతులు మాత్రం కామనే. ఇక ప్రత్యేకించి లివింగ్ రూమ్‌కో, బెడ్రూమ్కో అందాన్ని ఆపాదించాలనుకుంటే తళుకుబెళుకుల లైట్లకు మించిన మార్గం లేదు. అందుకే అతి సులువుగా అలంకరించుకోగలిగేలా.. ప్రత్యేకమైన స్థలమంటూ అక్కర్లేకుండా ఎంచక్కా తెరల మీదే అమరిపోయేలా ఎల్యీడీ కర్టెన్ లైట్లు మార్కెట్లోకి వచ్చాయి.
ఎన్ని రకాలో
ముచ్చటైన తెరలకు తళుకులద్దే ఎల్యీడీ లైట్లను అమర్చుకోవడం అతి సులువు. కర్టెన్ పరిమాణాన్ని బట్టి మనకు కావలసిన సైజులో లైట్ల వరుసను ఎంపిక చేసుకోవాలి. వాటిని సరైన పద్ధతిలో కర్టెన్ రాడ్‌కు వేలాడదీయాలి. తర్వాత ప్లగ్‌ను కనెక్ట్ చేసి, లైట్లతోపాటు వచ్చే రిమోట్ సాయంతో లైట్లు ఏ విధంగా వెలగాలన్నది సెట్ చేసుకోవచ్చు. స్లో గ్లో
(నెమ్మదిగా ఒక్కోటి వెలగడం), స్లో ఫేడ్ (నెమ్మదిగా ఒక్కొక్కటి ఆరిపోవడం), ట్వింకిల్ (చుక్కల్లా తళుక్కున మెరుస్తూ వెలగడం), సీక్వెన్స్ (ఒక్కో రంగూ ఒక్కోసారి వరుసల్లో కాంతులీనడం).. ఇలా విభిన్న రకాలు ఉంటాయి ఇందులో. మన మూడ్‌ను, అలంకరణ అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. స్టార్స్, స్నో ఫ్లేక్స్, స్వస్తిక్, ఓంకారం, దీపాలు.. ఇలా రకరకాల ఆకృతుల్లో దొరుకుతున్నాయి. స్ట్రింగ్కే కాకుండా ఈ ఆకృతుల లోపల కూడా ఎల్యీడీలు ఉండటంతో చీకట్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. పండగ రోజుల్లో దేవుడి మండపానికి వెనక భాగంలో అలంకరణకు ఉపయోగించడానికి కూడా బాగుంటాయి. కొత్త ఇంటిని మెరిపించేందుకో, పండగలప్పుడు ప్రత్యేకంగా కనిపించేందుకో కూడా తెచ్చుకోవచ్చు.
Read More :
“మూలన పడిన పాత సైకిల్‌ను ఇలా అందంగా మార్చేసుకోండి”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

