చెమట చుకల్లో పారిశ్రామిక ప్రగతి
పరిశ్రమల్లో చెమట చుకల పరిమళాలు వెదజల్లాయి...యంత్రాల చప్పుళ్లు ఉపాధి గీతాలుగా మారాయి. పెట్టుబడులు పరిశ్రమలుగా రూపుదిద్దుకొని, పరిశ్రమలు వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచాయి.
పరిశ్రమల్లో చెమట చుకల పరిమళాలు వెదజల్లాయి…యంత్రాల చప్పుళ్లు ఉపాధి గీతాలుగా మారాయి. పెట్టుబడులు పరిశ్రమలుగా రూపుదిద్దుకొని, పరిశ్రమలు వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచాయి. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పారిశ్రామిక అభివృద్ధి.. కొత్త జిల్లాల ఆవిర్భావంతో అంతటా విస్తరించడం ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రధాన పరిశ్రమలు రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే అధికంగా కేంద్రీకృతమై ఉన్నాయి.
2024 ఆర్థిక ప్రణాళిక వివరాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం ఫ్యాక్టరీల్లో 43.4 శాతం ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి. ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 43.02 శాతం, కార్మికుల్లో 45.02 శాతం కూడా ఈ జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే మొత్తం అవుట్పుట్లోనూ ఈ మూడు జిల్లాల వాటా 58.7 శాతంగా ఉంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పారిశ్రామిక అభివృద్ధి కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితం కాకుండా.. ఆయా జిల్లాల సహజ వనరులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజ సంపద, స్థానిక అవసరాలకు అనుగుణంగా విస్తరించే ప్రక్రియ ఊపందుకుంది.
పరిశ్రమల స్థాపనకు అనుమతులను వేగవంతం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్, టీఎస్ -బీపాస్ వంటి సింగిల్ విండో విధానాలు పారిశ్రామికవేత్తలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేశాయి. ఫలితంగా కొత్త పెట్టుబడులు రావడం, పరిశ్రమల సంఖ్య పెరగడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు విస్తరించడం క్రమంగా ప్రారంభమైంది. వ్యవసాయాధారిత జిల్లాలకు ఈ మార్పు మరో రూపంలో కనిపించింది. జగిత్యాల అందుకు ఒక ఉదాహరణ. వరి సాగు విస్తారంగా ఉండే ఈ జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తికి అనుబంధంగా రైస్ మిల్లులు విస్తరించాయి.

Product
2016లో జిల్లా ఏర్పడే నాటికి జగిత్యాల పరిధిలో 60కి లోపుగా ఉన్న రైస్ మిల్లుల సంఖ్య 2024 నాటికి సుమారు 200కు చేరుకోవడం గమనార్హం. వ్యవసాయ క్షేత్రాల్లో పండిన ధాన్యం.. మిల్లుల ద్వారా విలువను సంతరించుకొని, అదే ప్రాంతంలో ఉపాధి, రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చింది. 2016 రాష్ట్ర ప్రణాళిక సంఘం లెకల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 730 పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల్లో రూ.80,422 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు నమోదైంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పారిశ్రామికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఊహించిన ప్రగతి నమోదైంది.
2023 ఆర్థిక ప్రణాళిక సంఘం లెకల ప్రకారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలను కలుపుకొని 1,011 పరిశ్రమలు రన్ అవుతున్నాయి. వీటిలో 54,841 మంది కార్మికులు, 58,002 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పరిశ్రమల రంగంలో రూ.2,29,967 లక్షల పెట్టుబడులు నమోదయ్యాయి అంటే.. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పారిశ్రామిక రంగం పరుగులు తీసింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

