కాంతి (లైట్) కదలికలను కెమెరాలో బంధించడమే.. లైట్ ట్రైల్ ఫొటోగ్రఫీ! ఇదో అద్భుతమైన కళ. ఇది ఒకరకమైన లాంగ్ ఎక్స్పోజర్ ఫొటోగ్రఫీ. కెమెరా షట్టర్‌ను ఎక్కువసేపు తెరిచి ఉంచడం ద్వారా.. ఆసక్తికరమైన, ప్రత్యేకమైన ఫొటోలు తీయొచ్చు.
స్ట్రీట్ లైట్ ట్రైల్ ఫొటోగ్రఫీలో వాహనాల హెడ్లైట్లు, బ్యాక్ (బ్రేక్) లైట్లు, ఇతర కదిలే లైట్లు ప్రధాన సబ్జెక్టుగా ఉంటాయి. వీటిని ఫొటో తీయడం ద్వారా కాంతిని రోడ్డుపై పారే జలపాతంలా చూపించొచ్చు. సాధారణంగా డీఎస్ఎల్ఆర్ కెమెరాల సహాయంతో తీసే ఈరకం ఫొటోలు.. ఇప్పుడు మొబైల్ కెమెరాలతోనూ తీయవచ్చు! అందుకు కావాల్సింది.. కాస్త సహనం, కొంచెం ప్రాక్టీస్, సరైన సెట్టింగ్స్ మాత్రమే!
మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రో మోడ్ లేదా మాన్యువల్ మోడ్ ఉంటే.. ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోండి.
షట్టర్ స్పీడ్‌ను తగ్గించడం (షట్టర్‌ను ఎక్కువసేపు తెరిచి ఉంచడం) వల్ల కదిలే కాంతులు ఓ మార్గం (ట్రైల్)లా కనిపిస్తాయి. వీటిని ఫొటోలు తీస్తే.. ‘కాంతి వర్ణచిత్రం’ (లైట్ పెయింటింగ్)లా అనిపిస్తాయి.
మొబైల్ యాప్స్ : ఆండ్రాయిడ్ కోసం..
కెమెరా ఎఫ్‌వీ 5 ప్రొ క్యామ్ఎక్స్ ఓపెన్ కెమెరా
ఐఫోన్ కోసం : స్లో షట్టర్ క్యామ్, స్పెక్టర్ కెమెరా, ప్రో కెమెరా
మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రో మోడ్/ మాన్యువల్ మోడ్ లేనట్లయితే.. ఈ యాప్స్‌తో లైట్ ట్రైల్ ఫొటోలను సులభంగా తీయవచ్చు. ఈ యాప్స్‌లో షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ, ఫోకస్.. ఇలా అన్నిటినీ కస్టమైజ్ చేసుకోవచ్చు.
1. లైట్ ట్రైల్ ఫొటోగ్రఫీలోని ప్రాథమిక సూత్రం.. ఫోన్‌ను కదలకుండా ఉంచడం. ఇందులో షట్టర్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఫొటోలు షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఫోన్‌ను ట్రైపాడ్‌పై ఉంచడం తప్పనిసరి.
2. వేగంగా దూసుకెళ్తున్న వాహనాలపై ఫోకస్ చేయండి. అందులోనూ ఫ్లై ఓవర్లు, రోడ్డు మలుపుల దగ్గర మంచి ఫొటోలు వస్తాయి.
3. వాహనాల లైట్స్పైన 5 నుంచి 10 సెకన్లపాటు షట్టర్ ఓపెన్ చేసి ఫోకస్ చేయండి.
4. సెల్ఫ్ టైమర్ వల్ల ఫోన్ కదలకుండా ఉంటుంది.
5. క్రియేటివ్ యాంగిల్స్‌లో ట్రై చేయండి. ఎత్తుల పల్లాల నుంచి, మూల మలుపుల దగ్గర.. విభిన్న కోణాల్లో ఫొటోలు తీయడానికి ప్రయత్నించండి.
ఫైనల్‌గా.. లైట్ ట్రైల్స్ ఫొటోగ్రఫీ అనేది కేవలం కాంతిని పట్టుకునే కళ మాత్రమే కాదు. అది కాంతి కదలికలను, కాంతి వేగాన్ని కూడా అందంగా చూపించే శైలి. మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తోనే అద్భుతమైన లైట్ పెయింటింగ్స్‌ను సృష్టించవచ్చు. కేవలం సరైన సెట్టింగ్స్, ఒక్క ట్రైపాడ్, కొంత ప్రాక్టీస్ ఉంటే చాలు. ఈరోజే ప్రయత్నించండి. రాత్రివేళ రోడ్డుపై వెళ్తున్న వాహనాల లైట్స్‌ను మీ కెమెరాలో బంధించండి!