ప్రధాన రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన ఇలా!
ఒక రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేయడం కత్తి మీద సామే! జనాగ్రహానికి గురికాకుండా నిర్ణయం తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు! అందుకే చాలా రాష్ర్టాల్లో దశాబ్దాల కాలం తర్వాత గానీ జిల్లాల పునర్విభజన జరగలేదు.
ఒక రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేయడం కత్తి మీద సామే! జనాగ్రహానికి గురికాకుండా నిర్ణయం తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు! అందుకే చాలా రాష్ర్టాల్లో దశాబ్దాల కాలం తర్వాత గానీ జిల్లాల పునర్విభజన జరగలేదు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 10 జిల్లాలు. రెండేండ్లకే జిల్లాల పునర్విభజన చేపట్టారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఏండ్లకేండ్లు వేచి చూసి.. అభివృద్ధిని దూరంగా నెట్టలేదాయన. సంక్షేమంలో చూపిన వేగమే.. సంస్కరణల అమలులోనూ ప్రదర్శించారు. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాల రాష్ట్రంగా రూపుదిద్దారు! ఈ క్రమంలో దేశంలోని ప్రధానరాష్ర్టాల్లో జిల్లాల పునర్విభజన ఎప్పుడెప్పుడు జరిగిందో ఒక లుక్కేద్దాం!
రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య: 21 (1956)
జిల్లాల పునర్విభజన ఎప్పుడు ఎలాగంటే: 22 (1970), 23 (1979), 13 (2014-రాష్ట్ర విభజన), 26 (2022), 28 (2025)
ప్రస్తుతం జిల్లాలు: 28
పునర్విభజన ఎందుకంటే: వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం
రాష్ట్రం: కర్ణాటక
రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య: 19 (1956)
జిల్లాల పునర్విభజన ఎప్పుడు ఎలాగంటే: 20 (1991), 27 (1997), 29 (2007), 30 (2009), 31 (2021)
ప్రస్తుతం జిల్లాలు: 31
పునర్విభజన ఎందుకంటే: పరిపాలనా వికేంద్రీకరణ
రాష్ట్రం: గుజరాత్
రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య: 17 (1960)
జిల్లాల పునర్విభజన ఎప్పుడు ఎలాగంటే: 18 (1964), 19 (1966), 24 (1997), 25 (2000), 26 (2007), 33 (2013), 34 (2025)
ప్రస్తుతం జిల్లాలు: 34
పునర్విభజన ఎందుకంటే: రాజధానికి జిల్లా కేంద్రాలు దూరంగా ఉండటం, పరిపాలనా సౌలభ్యం
రాష్ట్రం: ఉత్తర్‌ప్రదేశ్
రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య: 54 (1950)
జిల్లాల పునర్విభజన ఎప్పుడు ఎలాగంటే: 55 (1974), 56 (1976), 57 (1988), 59 (1989), 60 (1994), 62 (1995),
70 (1997), 57 (2000-రాష్ట్ర విభజన), 71 (2008), 72 (2010), 75 (2011)
ప్రస్తుతం జిల్లాలు: 75
పునర్విభజన ఎందుకంటే: జనాభా పెరుగుదల, జిల్లాల విస్తీర్ణం, పరిపాలనా సౌలభ్యం
రాష్ట్రం: రాజస్థాన్
రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య: 25 (1949)
జిల్లాల పునర్విభజన ఎప్పుడు ఎలాగంటే: 25 (1950), 26 (1956), 27 (1982), 30 (1991), 31 (1994), 32 (1997), 33 (2008), 41 (2024)
ప్రస్తుతం జిల్లాలు: 41
పునర్విభజన ఎందుకంటే: జిల్లాల విస్తీర్ణం, పరిపాలనా పరమైన సౌలభ్యం
రాష్ట్రం: బీహార్
రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య: 10 (1936)
జిల్లాల పునర్విభజన ఎప్పుడు ఎలాగంటే: 17 (1956), 26 (1972), 28 (1973), 31 (1976), 33 (1981), 35 (1983), 37 (1986), 39 (1988), 42 (1991), 50 (1992), 55 (1994), 37 (2000-రాష్ట్ర విభజన), 38 (2001)
ప్రస్తుతం జిల్లాలు: 38
పునర్విభజన ఎందుకంటే: పరిపాలనా సౌలభ్యం
రాష్ట్రం: ఒడిశా
రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య: 6 (1936)
జిల్లాల పునర్విభజన ఎప్పుడు ఎలాగంటే: 13 (1948), 27 (1993), 30 (1994)
ప్రస్తుతం జిల్లాలు: 30
పునర్విభజన ఎందుకంటే: పరిపాలనా వికేంద్రీకరణ
వీటితోపాటు మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు రాష్ర్టాల్లోనూ.. దఫదఫాలుగా జిల్లాల పునర్విభజన చేపట్టారు.
– కడవేర్గు రాజశేఖర్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

