నాకు కోరికలు ఎక్కువ.. అమ్మాయి కనిపిస్తే చాలు.. అయితే..

మేడమ్! నాకు శృంగార కోరికలు చాలా ఎక్కువ. రోడ్డుమీద ఎవరైనా అమ్మాయి కనిపించినా, ఆమె మాట విన్నా కోరికలు వెంటనే బయటికి వస్తాయి. కానీ, ఇంతవరకు ఏ స్త్రీ దగ్గరకు వెళ్లలేదు. కారణం నాకు వచ్చే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని అనుకుంటానో, నేనూ అంతే పవిత్రంగా ఉండాలకుంటున్నా. అయితే, కోరికలను హస్త ప్రయోగం ద్వారా తీర్చుకుంటున్నా. రోజుకు 4-5 సార్లు చేయడం వల్ల తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. అలా చేయడం వల్లే నొప్పులొస్తున్నాయా? – వినోద్
నీకు కాబోయే భార్యపట్ల నువ్వు బాధ్యతగా ఉండటాన్ని అభినందిస్తున్నా. అలాగే, ఏ అమ్మాయిని చూసినా లైంగికంగా ఉద్రేకం కలగడాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే స్త్రీ ఒక లైంగిక వస్తువు కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆమెను అవయవాల కుప్పగా కాక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా గౌరవించాలి. రోజుకొకసారి హస్త ప్రయోగం తప్పు కాదు. అది నీ అధిక వాంఛలను కంట్రోల్ చేసి, నిన్ను దారి తప్పకుండా కాపాడుతుంది. సెక్స్‌మీద నుంచి నీ దృష్టి మళ్ళించుకోవడానికి చదువు మీద ఏకాగ్రతను చూపించు. సమాజహిత కార్యక్రమాల్లో పాలుపంచుకో. డాక్టర్ వద్ద కౌన్సెలింగ్ తీసుకో.
మేడమ్ నాకు ఇద్దరు పిల్లలు. నా భార్యకు రక్తహీనత ఉందని, ఆమెకు ట్యూబెక్టమీ వద్దనుకుంటున్నాను. నేను వేసెక్టమీ చేయించుకోవాలను కుంటున్నాను. వేసెక్టమీ తర్వాత నేనేమన్నా జాగ్రత్తలు పాటించాలా? ఆపరేషన్ తర్వాత కొద్దిగా వీర్యకణాలు మిగులుతాయట కదా? అవి ఏమవుతాయి? – రాజు, ఖమ్మం
ముందుగా నీ భార్య ఆరోగ్యం, భద్రత కోసం మీరు తీసుకున్న నిర్ణయానికి అభినందనలు. లాప్రోస్కోపీ ద్వారా చేసే ట్యూబెక్టమీకి రక్తస్రావం జరగదు. వేసెక్టమీ లోకల్ అనస్థీషియా ఇచ్చి చేసే చాలా మైనర్ ఆపరేషన్. హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. దీనివల్ల పిల్లల్ని పుట్టించే సామర్థ్యం పోతుంది. అంతేకానీ, లైంగిక సామర్థ్యం ఎప్పటిలాగే ఉంటుంది. రక్తస్రావం అస్సలు కాదు. సెక్స్ హార్మోన్స్ అయిన టెస్టోస్టీరాన్ హార్మోన్స్ అసలు తగ్గవు. ఒక వారం దాకా టైట్ ఫిట్టింగ్ అండర్వేర్ వేసుకోవాలి. ఇది వాపుని తగ్గించి, వృషణాలకు సపోర్ట్ ఇస్తుంది. కుట్లదగ్గర బాండేజెస్ మారుస్తుండాలి. ఇక మిగిలిన వీర్యకణాలు ఫాగోసైట్ (ధ్వంసం) అవుతాయి. ఆపరేషన్ తర్వాత పదిసార్లు వీర్య స్ఖలనం అయిన తర్వాత మాత్రమే సెక్స్‌లో పాల్గొనాలి. వీర్యపరీక్ష చేయించుకొని నెగెటివ్ వచ్చేవరకూ కండోమ్ వాడొచ్చు.
డా. భారతి (ఎమ్మెస్)
మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్,
జయా హాస్పిటల్
బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 9908383910
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

