Best Tourist Places | రూ. రెండు లక్షల్లోపే ఈ దేశాలను ఎంచక్కా చుట్టిరావొచ్చు
Best Tourist Places | కరోనా కారణంగా రెండేండ్లు ఏ యాత్రా లేక విసిగిపోయిన పర్యాటకులకు వినోదాల వేళయింది. కొవిడ్ నిబంధనల పహారా మధ్య స్థానిక విహారాలు కానిచ్చినా.. కరోనా ఉధృతి ఉపశమించడం, వ్యాక్సిన్ రక్షణగా ఉండటంతో ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ అని రాగాలు తీస్తున్నారు. ఏ దేశమేగాలో ఆరాలు తీయకండి. రెండు లక్షల రూపాయల బడ్జెట్లో చుట్టివచ్చే చూడచక్కని దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని..
వండర్ఫుల్ ఇండోనేషియా
హిందూ మహాసముద్రంపై తేలియాడే ఇండోనేషియా దాదాపు 17వేల దీవుల సమూహం. వీటిలో జనావాసం ఉన్న దీవులు కొన్నే అయినా, పర్యాటక ఆకర్షణలు ఉన్నవి మాత్రం కోకొల్లలు. బాలీ, లాంబక్, జావా, సుమత్రా, న్యూగినియా తదితర దీవులు సముద్ర క్రీడలకు అడ్డాలు.

అదిరే ఆస్ట్రియా

ఐరోపా ఖండంలో కడిగిన ముత్యంలా ఉంటుంది ఆస్ట్రియా. ఈ చిన్ని దేశం యాత్రికుల స్వర్గమే! ప్రతి నగరంలో చారిత్రక నిర్మాణాలు, అందమైన ఉద్యానవనాలు దర్శనమిస్తాయి. పురాతన చర్చీలు, వస్తు సంగ్రహాలయాలు యాత్రికులకు నాణ్యమైన కాలక్షేపాన్ని అందించి తీరతాయి.

జోర్దార్ జోర్డాన్

పశ్చిమ ఆసియాలోని ఎడారి దేశం జోర్డాన్. క్రీస్తు శకం 3వ శతాబ్దిలో పురుడుపోసుకున్న పెట్రా నగరంలో అడుగడుగునా అపురూప కట్టడాలు దర్శనమిస్తాయి. సుగంధ ద్రవ్యాలు అమ్మే వీధులు, భారీ పర్వతాలు.. ఇలా చెబుతూ పోతే జోర్దార్ పర్యటనకు కావాల్సిన అన్ని హంగులూ జోర్డాన్‌లో ఉన్నాయి.

టర్కియే చుట్టేద్దాం

ఆసియా-యూరప్ ఖండాల్లో విస్తరించి ఉన్న దేశం టర్కియే. ఈ దేశ చారిత్రక రాజధాని ఇస్తాంబుల్ పర్యాటకులకు స్వర్గధామం. ముత్యపు చిప్పల్లా ఉన్న చిన్నిచిన్ని జలపాతాల సమూహం పాముక్కలే విహారం, క్యాపడోసియాలో హాట్ బెలూన్ రైడ్ జీవితాంతం గుర్తుండిపోతాయి.

Read More :
“Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి”
“బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది”
“Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హనీమూన్.. ఎక్కడో తెలుసా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

