ఒకప్పుడు కేవలం సందేశాలకు, సంభాషణలకు మాత్రమే పరిమితమైన ఫోన్‌తో ఇప్పుడు అపరిమితమైన సేవలు పొందుతున్నాం. స్మార్ట్‌ఫోన్ వచ్చాక కీలక విషయాలు, బ్యాంకు వివరాలు అన్నీ అందులోనే పొందుపరుస్తున్నాం. ఆర్థిక లావాదేవీలకూ బెస్ట్ ఆప్షన్‌గా ఫోన్‌నే ఎంచుకుంటున్నాం. అయితే, మన అలవాటును స్కామర్లు తమ వెసులుబాటుగా మార్చుకుంటున్నారు. చిటికెలో ఏమార్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఫ్రాడ్‌స్టర్ల బారిన పడొద్దంటే ఎన్క్రిప్షన్కు మించిన ప్రిస్క్రిప్షన్ లేదంటున్నారు నిపుణులు.
ఒకప్పుడు డైరీ రాయడం చాలామంది అలవాటుగా ఉండేది. యూజర్ ఐడీలు, పాస్వర్డులు లేకపోయినా.. ఒకరి డైరీ చదవొద్దన్న నైతికత దానికి రక్షణ కల్పించేది. ఇప్పుడు ఫింగర్‌ప్రింట్ లాక్, ప్యాటర్న్ పాస్వర్డ్ ఎన్ని ఉన్నా.. డేటా భద్రత 2జీ సిగ్నల్ కన్నా బలహీనంగా ఉంటున్నది. మెసేజ్ రూపంలోనే ఫోన్లోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్నంతా కొల్లగొట్టేస్తున్నారు స్కామర్లు. అయితే, ఆన్లైన్ అకౌంట్లను ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా స్మార్ట్ దునియాలో సేఫ్‌గా ఉండొచ్చు.
ఎన్క్రిప్షన్ అంటే మన డేటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా కల్పించే రక్షణ. ఉదాహరణకు వాట్సాప్‌లో మనం ఒక మేసేజ్ పంపాం అనుకోండి. వాట్సాప్ ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా మనం పంపే సందేశాలు జంబుల్డ్గా మారిపోతాయి. దీనిని క్రిప్టోగ్రఫీ అంటారు. మీరు ఎవరికి పంపారో ఆ వ్యక్తికి మాత్రం డిస్క్రిప్ట్ మెసేజ్ చేరుతుంది. అలా రిసీవర్ మాత్రమే మనం పంపిన మెసేజ్‌ను చదవగలడు.
ఎన్క్రిప్షన్ చేయడం ఎలాగంటే..
మారిన కాలమాన పరిస్థితుల్లో మన జీవన విధానం అంతా మెయిల్‌బాక్స్‌లో నిక్షిప్తమైంది. స్కామర్లుగానీ మెయిల్ అకౌంట్లోకి చొరబడ్డారా.. దానికి లింక్ అయి ఉన్న సామాజిక మాధ్యమాల అకౌంట్లూ ప్రమాదంలో పడొచ్చు. వ్యక్తిగత సమాచారం లూటీ కావొచ్చు. మెయిల్లోని వివరాల ఆధారంగా మీ బ్యాంకు ఖాతానూ ఇక్కట్లకు గురిచేయొచ్చు. మీ ఇ-మెయిల్ అకౌంట్ భద్రంగా ఉండాలంటే మెయిల్ బాక్స్‌లో టూ-ఫ్యాక్టర్ (2ఎఫ్ఏ) ఆథంటికేషన్ ఎనేబుల్ చేయాలి. సులభతరమైన పాస్వర్డ్ కాకుండా కఠినమైనదాన్ని సెటప్ చేయడం ద్వారా అదనపు భద్రత లభిస్తుంది.
టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే..
హార్డ్‌డ్రైవ్ ఎన్క్రిప్షన్
డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లోని డేటా సేఫ్‌గా ఉండాలంటే హార్డ్‌వేర్ ఎన్క్రిప్షన్ మంచి మార్గం. డేటాను పూర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా మన డివైజ్‌లోకి స్కామర్లు తొంగిచూసినా వారికేం బోధపడదు. సిస్టమ్ మీరు ఓపెన్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే డేటా అంతా డిస్క్రిప్ట్ అవుతుంది. ఇండివిడ్యువల్ ఫైల్స్‌ను కూడా ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు. కానీ, ప్రతిసారీ పాస్‌కీతో వాటిని డిస్క్రిప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికన్నా.. హార్డ్‌డ్రైవ్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవడం మేలైన మార్గం. మీ డివైజ్‌కు కఠినమైన పాస్వర్డ్ ఉండటం ముఖ్యమని మరవొద్దు.
యాపిల్ మ్యాక్ కంప్యూటర్స్‌లో హార్డ్‌డ్రైవ్ ఎన్క్రిప్షన్ వివరాలు https://support.apple.com/en-in/guide/disk-utility/dskutl35612/mac లింక్ ద్వారా తెలుసుకోండి.
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే .. https://support.microsoft.com/en-us/windows/turn-on-device-encryption-0c453637-bc88-5f74-5105-741561a