ఏఐతో ఆగమాగం కావొద్దు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నేడు మన దైనందిన జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఆఫీస్ ఈమెయిళ్లు రాయడం, ప్రాజెక్ట్ నోట్స్ తయారు చేయడం, ప్లాన్లు వేసుకోవడం నుంచి సృజనాత్మక ఆలోచనల వరకు ప్రతీదానికి చాట్ జీపీటీ, జెమినై, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం సాధారణమైపోయింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నేడు మన దైనందిన జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఆఫీస్ ఈమెయిళ్లు రాయడం, ప్రాజెక్ట్ నోట్స్ తయారు చేయడం, ప్లాన్లు వేసుకోవడం నుంచి సృజనాత్మక ఆలోచనల వరకు ప్రతీదానికి చాట్ జీపీటీ, జెమినై, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం సాధారణమైపోయింది. ఇవి ఉత్పాదకతను విపరీతంగా పెంచినా మరోవైపు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాడీ వ్యవస్థ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజువారీ పనుల నుంచి మానసిక ప్రశాంతత వరకు ప్రతీదానికి చాట్‌బాట్స్‌పై ఆధారపడటం వల్ల మనుషులు స్వయం ఆలోచనా శక్తిని కోల్పోతున్నారు. క్రమంగా ఇది ఒక రకమైన మానసిక సమస్యకు దారితీస్తున్నది. ఏఐని పని సులభతరం చేసే సాధనంగా వాడటంలో తప్పు లేదు. కానీ, సొంతంగా ఆలోచించే శక్తిని, భావోద్వేగాలను అదుపు చేసుకునే సామర్థ్యాన్ని, తోటి మనుషులతో సంబంధాలను ఏఐతో భర్తీ చేయడమే అసలైన ప్రమాదం.
ఆత్మవిశ్వాసం కోల్పోవడం
ఏఐకి బానిసవుతున్నారని చెప్పడానికి మొదటి సంకేతం ఆత్మవిశ్వాసం తగ్గడం. చిన్నచిన్న విషయాల్లో కూడా ఏం ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలపై ఏఐని సంప్రదిస్తుంటారు. ఈ ధోరణి మెదడు స్వతంత్ర విశ్లేషణా శక్తిని బలహీనపరుస్తుంది.
బాధలు చెప్పుకోవడం
బాధ, ఒత్తిడి, ఏకాంతం ఆవహించినప్పుడు తోటి మనుషులు, స్నేహితులతో కాకుండా చాట్ బాట్స్‌తో మాట్లాడుతుంటారు. కానీ, వాటికి నిజమైన మానవ సానుభూతి, భావోద్వేగాలు ఉండవు. మనుషులను కాదని డిజిటల్ సాధనాలతో ఉద్వేగాలను పంచుకోవడం వల్ల వ్యక్తిగతంగా మరింత ఒంటరితనం పెరుగుతుంది.
ఒత్తిడి, ఆందోళన
సర్వర్ డౌన్ కావడం వల్లో, మరే ఇతర కారణంగానో చాట్‌బాట్ ఓపెన్ కాకపోతే.. తీవ్రంగా ఆందోళన చెందుతున్నారంటే మానసికంగా చాలా పెద్ద సమస్యలో ఉన్నట్టే! సాంకేతికత అనేది సౌకర్యం కోసం ఉండాలి. కానీ, మీ మనసును
ఆగమాగం చేసేదిగా మారకూడదు.
సంభాషణ నివారించడం
తోటి మనుషులతో మాట్లాడేటప్పుడు వారి హావభావాలు, శరీర భాష, ఉద్వేగాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏఐతో మాట్లాడేటప్పుడు ఎలాంటి మానసిక శ్రమ అవసరం ఉండదు. దీనితో చాలామంది ప్రత్యక్ష సంభాషణలను నివారించి కృత్రిమ చాటింగ్‌కే పరిమితమవుతారు. ఇది రోజురోజుకూ సామాజిక సంబంధాలను దెబ్బతీస్తున్నది.
జీవితం దెబ్బతింటుంది
నైపుణ్యాలు పెంచుకోవడం పకనబెట్టి గంటల తరబడి ఏఐ చాట్‌బాట్స్‌తో కాలక్షేపం చేయడం, నిద్ర, ఉద్యోగం, చదువు వంటి నిత్యకృత్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటే.. మీరు ఏఐ వ్యసనంలో కూరుకుపోయినట్టే అని భావించక తప్పదు. ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నా చాట్‌బాట్స్‌ను వదల్లేకపోవడం ప్రవర్తనా నియంత్రణను కోల్పోతున్నారనడానికి నిదర్శనం.

Book
పుస్తక సమీక్ష
జీవిత సత్యాలు: మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానవెలుగులు పంచడంలో సాహిత్యానిది ప్రత్యేకమైన స్థానం. అలాంటి రచనలు అందరికీ సాధ్యం కావు. అవి కొందరి ఆలోచనల్లోంచి మాత్రమే పుట్టుకొస్తాయి. ఆ అరుదైన ఆలోచనకు సాక్ష్యమే ఈ 100 మనోవికాస కథలు. నమస్తే తెలంగాణ లాంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన తన కథలన్నీటిని పుస్తక రూపంలో మనకు అందించి, కోల్పోయిన విలువలను తిరిగి గుర్తుకు తెచ్చారు రచయిత ఆర్సీ కృష్ణస్వామిరాజు. ఈ కథలన్నిటి నేపథ్యం వేరైనా వాటిలోని సారాంశమంతా విశ్వాసం, నమ్మకం అనే విలువలపై సాగుతుంది. మనం ఏదైన పనిని చేస్తుంటే మనకు ఎదురయ్యే ఎగతాళి మాటలను లెక్క చేయకుండా ముందుకు సాగాలంటుంది ‘ఏనుగు చెవులు’ కథ. ప్రస్తుత సమాజంలో అన్ని తెలిసిన వాళ్లు అణకువగా ఉంటారు. కానీ, మిడిమిడి జ్ఞానం కలిగినవాళ్లు ఎగిరెగిరి పడతారనడానికి సాక్ష్యమే ‘నిండు కుండ’ కథ. జీవితంలో కష్టాలకు భయపడి చాలామంది సాహసాలకు యత్నించరు. కానీ, జీవితమంటేనే కష్టసుఖాలు. అవి కడిలిలోని కెరటాల్లాంటివి. ‘ఉలి దెబ్బల’కు శిల్పంగా మారిన ఓ రాయి తెగువ మనకు ఆదర్శం. మాయమైపోతున్న ఈ విలువలను మనందరికి గుర్తు చేయాలని.. ఏరుకొని మరి వాటిని దండలుగా అల్లారు రచయిత. చెప్పాలనుకున్న విషయాలను సాగదీయకుండా సూటిగా చెప్పడం ఈ కథల్లోని ప్రత్యేకత. వీటిని చదువుతున్నపుడు చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చెప్పిన చందమామ కథలు గుర్తుకొస్తాయి. నిద్రపుచ్చడానికి నానమ్మ చెప్పిన నీతి కథలూ యాదికొస్తాయి. ప్రస్తుత సమాజంలో బాల్యం పక్క దారిపడుతుంది. రేపటి పౌరులుగా వారికి ఈ జీవిత సత్యాలు ఎంతో అవసరం. విద్యార్థులతో పాటు విలువలు పెంపొందించుకునే ప్రతి ఒక్కరికీ ఆ పుస్తకం ఓ నిఘంటువు.
ధర్మో రక్షతి రక్షితః (100 మనోవికాస కథలు)
రచయిత: ఆర్సీ కృష్ణస్వామి రాజు
పేజీలు: 222, ధర: రూ.200
9032462565, 9393662821
– రాజు పిల్లనగోయిన
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- a mess
- AI lead you
- Don't let
- into
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

