కరెంట్ మీటర్
ఇటీవల జరిగిన సంఘటనలపై ప్రశ్నలు, సమాధానాలు ఇస్తున్నాం. పోటీ పరీక్షలు, జనరల్ నాలెడ్జ్ కోసం ఇవి ఉపయోగపడతాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ పోటీలకు వేదిక కానున్న రాష్ట్రమేది?
1) ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్‌ను ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. 27 క్రీడా విభాగాల్లో నిర్వహించే ఈ పోటీలకు వేదిక కానున్న రాష్ట్రమేది?
2) ఈ నెల చివరన ప్రస్తుతమున్న ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి భారత వైమానిక దళాధిపతిగా రక్షణశాఖ ఎవరిని నియమిస్తున్నట్లు వెల్లడించింది?
3) భారత మహిళల క్రికెట్ కెప్టెన్‌గా సుదీర్ఘకాలం వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ బాధ్యతలనుంచి వైదొలగింది. తదుపరి కెప్టెన్‌గా ఎవరు నియామకం అయ్యారు?
4) అంతర్జాతీయ శాంతి, సమానత్వ చట్టాల కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికైన భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా న్యాయవేత్త పేరేమిటి?
5) వ్యవసాయ పరంగా వెనుకబడిన జిల్లాలను జాతీయ స్థాయికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేసి ఇటీవల తెలంగాణ నుంచి అవార్డులు అందుకున్న జిల్లాలేవి?

Paddy
6) గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్తమ యాజమాన్య పద్ధతులను అమలు చేస్తున్నందుకు గాను ప్రతిష్ఠాత్మక ‘కన్జర్వేషన్ అష్యూర్డ్ | టైగర్ స్టాండర్ట్స్’ గుర్తింపును పొందిన అభయారణ్యమేది?
7) ఫ్లై దుబాయ్ విమానం కాక్‌పిట్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో తెగువ చూపిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయిల్ పౌరులకు ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారాన్ని ప్రకటించారు. ఇజ్రాయిల్ దేశం ప్రదానం చేసే ఆ అవార్డు పేరేమిటి?
8) 2026-27 ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టర్ల వరిసాగు విస్తీర్ణం తగ్గినట్లు ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా ఏ రాష్ట్రంలో తగ్గింది?
9) అయోధ్యలో కొలువైన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అరుదైన గుర్తింపునిచ్చింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ అందించిన ఆ సర్టిఫికేట్ పేరేమిటి?
10) విలక్షణ నటనతో, వైవిధ్యభరితమైన పాత్రలతో హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో 85కు పైగా చిత్రాల్లో నటించి సినీప్రియుల్ని అలరించిన దిగ్గజ నటుడు ఇటీవల గుండెపోటుతో మరణించారు. మహారాష్ట్రకు చెందిన ఆ నటుడు ఎవరు?
జవాబులు
1. తెలంగాణ
2. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
3. స్మృతి మంధాన
4. నవీ పిైళ్లె
5. నారాయణపేట, నాగర్‌కర్నూల్
6. సమేరీ టైగర్ రిజర్వ్ (అసోం)
7. ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం
8. తెలంగాణ (4.26 లక్షల హెక్టార్లు)
9. ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్
10. నానా పటేకర్ (75)

Navi Pillay

Gk

Gk 1

Gk 2
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

