చిన్నప్పుడు కొన్ని పండ్లు ఊడిపోయి, వాటి స్థానంలో కొత్తవి వస్తాయి. ఇదంతా సహజ పరిణామ క్రమమే. కానీ ఆ ఊడిన పండ్లను పరీక్షించి, బిడ్డలోని ఒత్తిడిని గుర్తించవచ్చా! ఆ ఒత్తిడి భవిష్యత్తు మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో ఊహించవచ్చా? అసాధ్యంగా తోచినా ఇది నిజమని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక చెట్టును నరికినప్పుడు, దాని కాండం మీద ఎలాగైతే, వలయాలు కనిపిస్తాయో… అలాగే పన్ను పొరలను గుర్తించడం వల్ల బిడ్డ ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. వీటిని ‘స్ట్రెస్ లైన్స్’గా పేర్కొంటున్నారు. తీవ్రమైన పేదరికం వల్ల పోషకాహార లోపం ఉంటే ఒకరకంగా, తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైతే ఇంకో రకంగా, హార్మోన్ల ప్రభావం వల్ల మరో రకంగా .. పాల పండ్ల మీద స్ట్రెస్ లైన్స్ ఏర్పడతాయట. మూడోవంతు మానసిక సమస్యలకు బాల్యం నాటి పరిస్థితులే కారణం. కాబట్టి, పాలపండ్ల మీద కనిపించే గీతలను చదవగలిగితే… చిన్న తనంలోనే కౌన్సెలింగ్ అందించవచ్చు. ఆ గాయాలను మాన్పవచ్చు.