పుస్తక సమీక్ష
మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది. ఆ మంచి మనకే జరగవచ్చు, లేదంటే సమాజంలో పదిమందికీ మేలు చేసేదిగా ఉండొచ్చు. ఎంతోకొంత మంచి అనేది తప్పకుండా జరుగుతుంది. పెద్దింటి అశోక్ కుమార్ తాజా కథా సంకలనం ‘విత్తనం’లోని విత్తనం కథ ఇదే సందేశాన్ని ఇస్తుంది.
మంచిని కోరుకునే కథలు
మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది. ఆ మంచి మనకే జరగవచ్చు, లేదంటే సమాజంలో పదిమందికీ మేలు చేసేదిగా ఉండొచ్చు. ఎంతోకొంత మంచి అనేది తప్పకుండా జరుగుతుంది. పెద్దింటి అశోక్ కుమార్ తాజా కథా సంకలనం ‘విత్తనం’లోని విత్తనం కథ ఇదే సందేశాన్ని ఇస్తుంది. ఇందులో మరో కథ ‘దూరం’ మత రాజకీయాల కల్మషత్వం ప్రజల జీవితాల్ని ఎంత కల్లోలానికి గురిచేస్తుందనే ఇతివృత్తంతో నడుస్తుంది. ఇక ‘ఏకగ్రీవం’ కథ రాజకీయాలు డబ్బుమయమైపోతే ప్రజాస్వామ్యం, ఓటుహక్కు ఎంత పరిహాసానికి గురవుతాయో కండ్లు తెరిపిస్తుంది. ఓటుహక్కు అమూల్యమైందని, దాన్ని డబ్బుకు అమ్ముకోకూడదనే సందేశం ఈ కథలో ప్రధానంగా కనిపిస్తుంది.
సమాజంలో సంస్కరణ అంత సులువుగా జరగదు. ఒక్కరితో మొదలవుతుంది. ఒక్కరు ఇద్దరవుతారు. ఇద్దరు నలుగురవుతారు. చివరికి ఎక్కడో ఒకచోట మార్పు తప్పకుండా వస్తుందనే సందేశాన్ని ‘ఉల్లిపూసలు’ కథ చాటుతుంది. మహిళల జీవితాల విషయంలో నిర్ణయాధికారం వాళ్లదే అని ఈ కథ స్పష్టం చేస్తుంది. ప్రతీది రాజకీయమయమైన దగ్గర సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ‘సహగమనం’ కథ చిత్రిస్తుంది. అక్క కాపురం నిలబెట్టడాన్ని తన బాధ్యతగా తీసుకున్న తమ్ముడు ఏం చేశాడనేది ‘విక్కీ’ కథ వెల్లడిస్తుంది. అయితే, కథ ముగింపులో తండ్రి బాధ్యతగా మెలుగుతాడా అనేది ప్రశ్నగా మిగులుతుంది. కథ ఉద్దేశాన్ని బట్టి పాఠకుడు మంచి జరుగుతుందనే ఆశించాలి. ‘విత్తనం’ కథలో రచయిత పేర్కొన్నట్టు ఈ సంకలనంలోని కథలు బాధ్యత కలిగిన సమాజాన్ని కోరుకుంటాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

