ధర: రూ. 26,999
దొరుకు చోటు: https://rb.gy/4x23l0
మోటరోలా నుంచి మరోకొత్త ట్యాబ్ వచ్చేసింది! దీనిపేరు మోటరోలా ప్యాడ్ 60 ప్రొ. ఈ ట్యాబ్ రోజువారీ పనులు, సినిమాలు, చదువు.. అన్నిటికీ సరిపోతుంది. 12.7 అంగుళాల 3కే స్క్రీన్ ఉంది. 144 హెచ్జడ్ రిఫ్రెష్ రేట్‌తో చూడటానికి స్మూత్‌గా ఉంటుంది. వేసవి సెలవుల్లో ఫేవరేట్ సినిమా, సిరీస్‌లను హాయిగా చూడొచ్చు. నాలుగు ఏబీఎల్ స్పీకర్లు, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్ ఉంది. దీంతో సౌండ్ మరింత స్పష్టంగా వినిపిస్తుంది. ట్యాబ్‌తో వచ్చే మోటో పెన్ప్రోతో నోట్స్ రాయొచ్చు, డ్రాయింగ్లు గీయొచ్చు. క్లాస్ నోట్స్ రాయడం, ప్రెజెంటేషన్లు తయారుచేయడం లాంటి స్టూడెంట్స్ పనులను సులభంగా మార్చేస్తుంది. ఆఫీస్ పనులు చేసేవాళ్లకు కూడా ఉపయోగపడుతుంది.
మీడియోటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ ఉంది. దీంతో యూట్యూబ్, క్రోమ్, నోట్స్.. ఇలా ఎన్ని ఓపెన్ చేసినా స్మూత్‌గా రన్ అవుతాయి. 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 45వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో 75 నిమిషాల్లో ఫుల్‌చార్జ్ అవుతుంది. స్టూడెంట్స్, ఆఫీస్ వర్క్ చేసేవాళ్లు, సినిమా లవర్స్‌కి ఈ టాబ్ చక్కని ఎంపిక. రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఒకటి 8 జీబీ ర్యామ్ + 128 బీజీ స్టోరేజ్, రెండోది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
ధర: రూ. 54,990
దొరుకు చోటు: https://tinyurl.com/mrx8n6pm
వీడియోలు షూట్ చేయడం అంటే.. ఏదో విజువల్స్‌ని రికార్డ్ చేయడం కాదు. ఎక్స్‌ప్రెషన్‌ని క్యాప్చర్ చేయాలి. ఒకే వీడియోలో అన్ని డిటెయిల్స్ కనిపించాలి. అందుకోసం కొత్త టెక్నాలజీ కావాలి. అలాంటి అవసరాల కోసం ఇన్‌స్టా 360 ఎక్స్ 5 వచ్చింది. దీంట్లోని ప్రత్యేకతలు ఏంటంటే.. తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన వీడియోలు తీయొచ్చు. కొత్త ప్యూర్ వీడియో మోడ్ ద్వారా క్లారిటీని మరింతగా పెంచుకోవచ్చు. ట్రిపుల్ ఏఐ చిప్ సిస్టమ్.. వీడియోల్లో నాయిస్ తగ్గించి, ఫుటేజ్‌ని క్లీన్‌గా మార్చేస్తుంది.
ఇన్‌స్టా ఫ్రేమ్ మోడ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయడానికి అనువుగా వీడియోలను షూట్ చేయొచ్చు. టచ్ కంట్రోల్స్, వాయిస్ కంట్రోల్ 2.0, గెశ్చర్ కంట్రోల్ లాంటి కొత్త కంట్రోల్స్ దీంట్లో ఉన్నాయి. 2400 ఎంఏహెచ్ బ్యాటరీ 3 గంటల వరకూ ఫుటేజ్ తీసేందుకు తోడ్పడుతుంది. ఐపీ 68 వాటర్‌ప్రూఫ్ సర్టిఫికేషన్ ఉండటంతో నీటిలో కూడా 15 మీటర్ల లోతువరకూ రికార్డింగ్ చేయవచ్చు. లెన్స్‌లు డ్యామేజ్ అయితే మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. వ్లాగర్లు, అడ్వెంచర్ ట్రావెలర్స్, కంటెంట్ క్రియేటర్లకు చక్కగా ఉపయోగపడుతుంది.
ధర: రూ. 29,999
దొరుకు చోటు: https://tinyurl.com/bdec6t8a
ఒకప్పుడు మొబైల్ వాడకమంటే.. కొన్ని పనులకే పరిమితం. కానీ, ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. పనులు త్వరగా పూర్తి కావాలి. సమాచారం స్పష్టంగా అందాలి. సాయం వెంటనే కావాలి. ఈ అన్నిటికీ పరిష్కారం ఏఐ ఆధారిత ఫోన్లు. మోటరోలా ఎడ్జ్ 60 ప్రొ అలాంటిదే. దీని ప్రత్యేకత ఏంటంటే.. దీంట్లో గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పర్ప్లెక్సిటీ ఏఐ.. ఈ మూడు ఏఐ అసిస్టెంట్లలో ఒకదాన్ని వినియోగదారులే ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక ఫోన్ తెరవగానే అసిస్టెంట్ ప్రతిపనికీ సిద్ధంగా ఉంటుంది. ముఖ్యమైన నోటిఫికేషన్లను చక్కగా సమ్మరైజ్ చేస్తుంది. మాట్లాడిన దాన్ని లైవ్‌గా ట్రాన్స్‌లేట్ చేస్తుంది. దీని తెర పరిమాణం 6.7 అంగుళాలు. 256 జీబీ స్టోరేజ్‌తో.. పెద్దసైజు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ అన్నీ ఫోన్లోనే భద్రంగా ఉంచుకోవచ్చు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్, 10ఎంపీ టెలీ ఫొటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం 50ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
ధర: రూ. 750
దొరుకు చోటు: https://tinyurl.com/4nmppx7m
ఎండలు మామూలుగా లేవు. ఏ మాత్రం చాన్స్ దొరికినా ఏసీ ఆన్ చేసుకుని రిలాక్స్ అవుతున్నాం. అయితే, ప్రతి గదికీ ఏసీ అంటే.. కరెంటు బిల్లు బారెడు వస్తుంది. ఏసీ కొనాలంటే బోల్డంత ఖర్చు కూడా. ఈ క్రమంలో ఎక్కడైనా వాడుకునేందుకు అనువుగా ఓ మినీ కూలర్ ఉంటే? తక్కువ ఖర్చుతో ఎక్కడైనా పెట్టుకునే టెక్కూల్ మినీ కూలర్ చక్కని పరిష్కారం. ఈ పోర్టబుల్ మినీ కూలర్ సాదాసీదాగా కనిపిస్తుంది. కానీ, ఇందులో ఉన్న వాటర్ ఎవాపరేషన్ టెక్నాలజీ ద్వారా ప్రకృతిసిద్ధమైన చల్లదనాన్ని ఇస్తుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా, కేవలం నీటిని వాడటం వల్ల ఇది హానికరం కాదు. పవర్ కూడా తక్కువే తీసుకుంటుంది. టైమర్ సెట్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. దీంతో కావలసినప్పుడు ఆఫ్ అవుతుంది. చాలా తక్కువ బరువు ఉండటంతో ఆఫీస్, ఇల్లు, హాస్టల్, ట్రావెల్ ఎక్కడైనా తీసుకెళ్లవచ్చు. పిల్లల గదుల్లో, వర్క్ డెస్క్, స్మాల్ కిచెన్లలో చక్కగా పనిచేస్తుంది.