పుస్తక సమీక్ష
మహాభారతంలో కౌరవ పాండవుల్లో అంతగా తెలియని పాత్ర బర్బరీకుడు. ఇతను ఘటోత్కచుని కొడుకు. కురుపాండవ యుద్ధ సమయంలో మూడు ఆయుధాలతో పాండవుల తరఫున పోరాడటానికి వస్తాడు. అయితే, బలహీనుల తరఫున ఆయుధం ధరించడం బర్బరీకుడి ప్రత్యేకత.
- బర్బరీకుడి జీవిత చిత్రణ
మహాభారతంలో కౌరవ పాండవుల్లో అంతగా తెలియని పాత్ర బర్బరీకుడు. ఇతను ఘటోత్కచుని కొడుకు. కురుపాండవ యుద్ధ సమయంలో మూడు ఆయుధాలతో పాండవుల తరఫున పోరాడటానికి వస్తాడు. అయితే, బలహీనుల తరఫున ఆయుధం ధరించడం బర్బరీకుడి ప్రత్యేకత. మరి అతను యుద్ధంలో దిగాడంటే ఒకసారి దుర్బలులుగా ఉన్నవాళ్లు తరవాత బలం పుంజుకుంటారు. దాంతో అతను అప్పుడు బలహీనంగా మారిపోయిన వారి పక్షం వహించాల్సి ఉంటుంది. అంటే బర్బరీకుడు ఉన్నాడంటే యుద్ధానికి ముగింపనేది ఉండదు. ఒకవేళ యుద్ధం పూర్తయ్యిందంటే మాత్రం మిగిలేది ఒక్కడే… బర్బరీకుడే.
కాబట్టి కృష్ణుడు అతనికి మరణప్రాప్తిని అనుగ్రహిస్తాడు. తర్వాత బర్బరీకుడికి తన శక్తితో భారత యుద్ధాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తాడు కృష్ణుడు. ఈ కథ నేపథ్యంతో కన్నడంలో గురుపాద బేలూరు రాసిన ‘బర్బరిక’ నవలను వేలూరి కృష్ణమూర్తి తెలుగులోకి అనువదించారు. ప్రధానపాత్ర బర్బరీకుడే అయినప్పటికీ ఈ నవల కృష్ణుడి ఆత్మగతంగా సాగుతుంది. ఘటోత్కచుడు, బర్బరీకుల అవాంఛిత మరణాలకు కారణం తెలుస్తుంది. వేలూరి అనువాదం ఆమూలాగ్రం చదివించే శైలిలో సరళంగా సాగిపోయింది. హిడింబ, బర్బరీకుడి భార్య మోర్వి పాత్రచిత్రణ పాఠకులను ఆకట్టుకుంటుంది.
బర్బరిక
రచన: కన్నడ మూలం గురుపాద బేలూరు
అనువాదం: వేలూరి కృష్ణమూర్తి
పేజీలు: 116; ధర: రూ. 120
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
ఫోన్: 98487 87284
బుక్ షెల్ఫ్ అరచేతిలో స్వర్గం
రచన: సింహప్రసాద్
పేజీలు: 193,
ధర: రూ. 150
ప్రచురణ: శ్రీశ్రీ ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 95501 46514
మూడు దారులు
రచన: దేవులపల్లి అమర్
పేజీలు: 207, ధర: 395
ప్రచురణ: రూప పబ్లికేషన్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
పుత్రదేవోభవ
రచన: డా॥ ఎమ్.వి.జె. భువనేశ్వరరావు
పేజీలు: 164,
ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ఫోన్: 98487 87284
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

