సినిమాలపై ఇంట్రెస్టా? ఆన్లైన్లో ఇలా యాక్టింగ్ నేర్చుకోండి !!
Online Acting Classes | నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు కోసం ప్రవేశ పరీక్ష రాయాల్సిన పన్లేదు. బంజారాహిల్స్ యాక్టింగ్ స్కూల్లో ప్రవేశానికి లక్షలకు లక్షలు సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. అకౌంట్లో వెయ్యి రూపాయలు ఉన్నా చాలు. సుప్రసిద్ధ నటుల పాఠాలు వినవచ్చు. యాక్టింగ్‌లో మెలకువలు నేర్చుకోవచ్చు. ఆన్లైన్ కోర్సులు రేపటి తారలకు వరంగా మారాయి.
వెండితెర.. బుల్లితెర.. యువతకు ఆశలు రేకెత్తించే రంగుల తెర. ఇక్కడ వెలుగులీనుతున్న తారలెందరో. ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన క్రేజ్. ఆ వైభవాన్ని దక్కించుకునేందుకు దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమల్లో ‘ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్’ అంటూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహికులు ఎందరో. వారిలో ప్రతిభ ఉన్నవారినే అదృష్టం వరిస్తుంది. నటనపై ఆసక్తి ఉన్నా.. పరిపూర్ణంగా నేర్చుకోవడం ఎలా? అంటే.. నేరుగా స్టార్లే ఆన్లైన్ వేదికల మీదికి వచ్చి.. నటనలో ఓనమాలు దిద్దిస్తున్నారు.
* * *
ప్రపంచం మొత్తం వర్చువల్ లెర్నింగ్ వైపు మళ్లుతున్నది. యాక్టింగ్ క్లాసులు కూడా అదే కోవకు వచ్చాయి. యువతలో ఉన్న ఈ ఆసక్తిని వ్యాపారంగా మలుచుకునేందుకు ఉడెమీ, యాక్టర్ ప్రిపేర్స్, బారీజాన్ యాక్టింగ్ స్టూడియో, రజత్రాయ్ యాక్టింగ్ స్కూల్, అన్లూ క్లాస్, స్కిల్షేర్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ముందుకొస్తున్నాయి. విద్యార్థుల నుంచి నామమాత్రపు ఫీజు తీసుకుంటూ ప్రముఖులతో నటనలో శిక్షణ ఇప్పిస్తున్నాయి. పాఠాలు చెబుతున్నవారిలో సుప్రసిద్ధ నటులేకాదు, వివిధ కళారంగాల నిపుణులూ ఉన్నారు. శిక్షణ వ్యవధి కూడా మహా అయితే వారాల్లోనే ఉంటున్నది.
నటనా వికాసం
యాక్టింగ్ క్లాసులు వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు కూడా ఉపయోగపడతాయని అంటున్నారు శిక్షకులు. నటన ఒక వ్యక్తిని ప్రేక్షకుల ముందు మంచి నటుడిగా నిలబెడితే.. అదే నటన నలుగురిలో మాట్లాడే విధానాన్ని బోధిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. యాక్టింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఆన్లైన్ కోర్సులు ఉత్తమ మార్గం కూడా. ఫీజులు మరీ ఎక్కువేం కాదు. వేయి రూపాయల నుంచి పాతికవేల వరకూ ఉండవచ్చు. స్టీఫెన్ గ్రాహం (హాలీవుడ్), అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, మనోజ్ బాజ్‌పేయి వంటి దిగ్గజాలు తెర మీదికి వచ్చి మెలకువలు నేర్పుతారు. హావభావాలు పలికించడం బోధిస్తారు. ఆన్లైన్లో ఫీజు బదిలీ చేసి.. మెయిల్ ఐడీతో పేరు నమోదు చేసుకుంటే చాలు.

‘సోషల్స్వాగ్’లో అక్షయ్
‘సోషల్స్వాగ్’ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటనలో తర్ఫీదు ఇస్తున్నారు. తన 30 ఏండ్ల సినీ జీవితంలోని ఆటుపోట్లు, అనుభవాలు, మంచీచెడులు ఔత్సాహిక నటులతో పంచుకుంటున్నారు. నటన మొదలుకొని సెట్లో తోటివారితో మెలిగేతీరు, డైలాగ్ డెలివరీ, హావభావాల వరకూ అన్నీ నేర్పిస్తారు. పాత వీడియోలూ అందుబాటులో ఉంటాయి. గంట నిడివిగల వీడియోలను 9 ఎపిసోడ్లుగా వర్గీకరించారు. వాటిని చూసేందుకు రూ.333 నుంచి రూ.999 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

‘సెలెబ్రిటీ స్కూల్’లో నవాజుద్దీన్ సిద్ధిఖీ
నవాజుద్దీన్ సిద్ధిఖీ భారత్‌లోనే అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరు. ఈ ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ పూర్వ విద్యార్థి ‘సెలెబ్రిటీ స్కూల్’ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా యాక్టింగ్‌లో ఓనమాలు నేర్పుతారు. నవాజుద్దీన్ ఆన్లైన్ క్లాసులకు దాదాపు 32వేల మంది ఔత్సాహికులు హాజరవుతుంటారు. 34 ఎపిసోడ్స్ ఉన్న సిద్ధిఖీ ట్రైనింగ్ వీడియోలు చూడాలంటే రూ.2,999 చెల్లించాలి. తెలుగులో ప్రముఖ నటులు జగపతిబాబు ‘క్లిక్ సినీ కార్ట్’, ఉత్తేజ్ ‘మయూఖ’ మాత్రం ఆఫ్‌లైన్‌లోనే కొనసాగుతున్నాయి. నిజానికి, ఖరీదైన యాక్టింగ్ స్కూల్లో చేరి లక్షలకు లక్షలు సమర్పించుకునే కంటే.. ఆన్లైన్ క్లాసులే నయం! పాఠంలో దమ్ముంటే ఏకదమ్ స్టార్డమ్ వచ్చేస్తుంది.

‘అన్లూ’లో మనోజ్ బాజ్‌పేయి
మనోజ్ బాజ్‌పేయి ఓ విలక్షణ నటుడు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ‘అన్లూ’లో నటనలో శిక్షణ ఇస్తున్నారు. రెండున్నర గంటల క్లాస్‌లో ఎన్నో విషయాలు చర్చిస్తారు మనోజ్. ఆడిషన్స్‌ను విజయవంతంగా ఎదుర్కోవడం, స్క్రిప్ట్‌కు తగినట్టు నటించడం, మాండలికాలను పట్టుకోగలగడం.. వంటివన్నీ నేర్పుతున్నారు. ప్రతి క్లాసుకు పదిహేను వందలు చార్జ్ చేస్తారు. ‘బుక్‌మై షో యాప్’లోనూ రిజిస్టర్ చేసుకోవచ్చు. అన్లూలోనే కమెడియన్ జానీ లీవర్, మోనాలీ ఠాకూర్ (సింగింగ్), రస్కిన్ బాండ్ (స్క్రిప్ట్ రైటింగ్)లో శిక్షణ ఇస్తారు.
Read More :
అసలు ఫిల్మోక్రసీ అంటే ఏంటి? ఒక సినిమాకు ఇది ఎందుకంత ఇంపార్టెంట్”
రైతుగా మారిన నటుడు.. 40 ఆవులతో పాల వ్యాపారం”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

