KCR Birthday Special | జోక్ వేసాడంటే.. పొట్ట పగలాల్సిందే..
CM KCR Birthday Special | ఒకసారి ఏమైందో ఎరుకేనా?.. చుట్టూ ఉన్నవాళ్లు చెవులు రిక్కిస్తారు.‘అధ్యక్షా! ఫలానా వ్యక్తి వల్ల నాకు మానభంగం జరిగింది’ అంటూ ఓ ఆంగ్లో ఇండియన్ శాసన సభ్యురాలు నిండు సభలో ఫిర్యాదు చేసింది. స్పీకర్సాబ్ ఆ ‘ఫలానా’ వ్యక్తిని ఇదేందని అడిగిండు.‘నిజమే సార్! అనుకోకుండా గట్లయిపోయింది’ అని తప్పు ఒప్పుకొన్నడు. అసెంబ్లీలో గందరగోళం! “నిజానికి అక్కడ అయింది వేరు. ఆ శాసనసభ్యురాలు ఏదో సమస్య గురించి చర్చించడానికి పోతే, ‘ఫలానా’ నాయకుడు పట్టించుకోలేదట. ‘అవమానం’ అయిందని చెప్పుడు ఆమె ఉద్దేశం. అటు స్పీకరుగారికి, ఇటు ‘ఫలానా’ నాయకుడికి తెలుగు భాష మీద పట్టు లేకపోవడం గందరగోళానికి కారణమైంది” – అంటూ కేసీఆర్ సార్ తనదైన శైలిలో చెబుతుంటే నవ్వులే నవ్వులు!
కేసీఆర్ ఉపన్యాసాల్లోనూ అంతే సున్నితమైన హాస్యం తొంగిచూస్తూ ఉంటుంది. సామెతలూ, నుడికారాలూ ఆయన మాటల మసాలా డబ్బాలో సిద్ధంగా ఉంటాయి. ఇప్పటికీ కేసీఆర్ పిచ్చాపాటీలో ఇలాంటి సంఘటనలు నవ్వులు పండిస్తూనే ఉంటాయి. అసెంబ్లీ చర్చలు, బహిరంగ సభలు, విలేకరుల సమావేశాలు.. కేసీఆర్ పంచ్‌లతో నవ్వులు పూస్తూనే ఉంటాయి. కేసీఆర్ మార్కు హాస్యంలో మెత్తని బాణాలూ ఉంటాయి. అవి తగలాల్సిన వాళ్లకే తగులుతాయి. తగలాల్సిన చోటే తగులుతాయి. బహిరంగంగా నవ్వినా, బాత్రూమ్లోకి వెళ్లి బోరున ఏడ్చినవాళ్లూ ఉన్నారు.
సుబ్బిరామిరెడ్డి గారి శ్లోకాలు, వెంకయ్యనాయుడి గారి ప్రాసల తర్వాత మాట్లాడితే సీఆర్పీఎఫ్ లాఠీచార్జ్ తర్వాత చీపురుపుల్లతోని కొట్టినట్టు ఉంటది. ఇట్లాంటి సభల్లో కాసేపు స్వ డబ్బా, కాసేపు పర డబ్బా, కాసేపు పరస్పర డబ్బా! మీరు గొప్పవారు, మేం గొప్పవారం, వెరసి మనమందరం గొప్పవారం అనడం తప్ప మూడోది ఉండదు.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
CM KCR | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

