CM KCR | మనసులో తెలంగాణను నాటుతూ.. ఐఏఎస్‌లకు సరికొత్త పాలనా పాఠం
CM KCR | ముఖ్యమంత్రి అయిన కొత్తలో కేసీఆర్, సాగునీటి ఇంజినీర్ల విస్తృత సమావేశం నిర్వహించారు. సాధారణంగా, అందరు ముఖ్యమంత్రులూ నిర్వహించే సమీక్షలాగే ఇది కూడా గంటో రెండు గంటలో ఉంటుందని అందరూ అనుకున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సమావేశం మొదలైంది. మధ్యలో టీ కాఫీలయ్యాయి. మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్లీ మొదలైంది. సాయంత్రం స్నాక్స్ వచ్చాయి. డిన్నర్ కూడా ముగిసింది. ఆ తర్వాత, రాత్రి. అంటే తెల్లవారుజామున 2 గంటలకు సమావేశం ముగిసింది.
“ఇదేమిటి? సీఎం సమీక్ష అంటే ఇలా ఉంటుందా? ఒక రంగంపై ముఖ్యమంత్రి ఇంత లోతుగా దృష్టిపెడతారా?” అని ఆశ్చర్యపోయారు ఇంజినీర్లు. ఉమ్మడి రాష్ట్రంలో మొక్కుబడి సమావేశాలు మాత్రమే చూసిన ఇంజినీర్లకు ఇదో కొత్త అనుభవం. సమావేశంలో కేసీఆర్ తెలంగాణలో మూలమూలలా ఉన్న పల్లెల పేర్లు, వాగుల పేర్లు, చెరువుల పేర్లు చెబుతుంటే వారు ఆశ్చర్యపోయారు. తెలంగాణ రీ ఓరియెంటేషన్, రీ ఇన్వెన్షన్లో అధికార యంత్రాంగం సన్నద్ధతే కీలకం అంటారు కేసీఆర్. తాను చేపట్టబోయే ఒక కార్యక్రమాన్ని తన వాళ్ళ మధ్య అత్యంత ప్రతిభావంతంగా ప్రవేశపెట్టి, దానిపట్ల అమితమైన ఆసక్తిని రేకెత్తించి, దానిలో భాగస్వాములం కాకుంటే ఏం కోల్పోతామో అన్న ఉత్కంఠను రేకెత్తించి, అందరినీ మోటివేట్ చేసి, చివరికి ఘనవిజయం సాధించేలా చేస్తారు.
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నీళ్లు తాగి ప్రజల నడుములు ఒంగిపోయినయి. మిషన్ భగీరథకు అక్కడే శిలాఫలకం వేసిన. స్వయాన భారత జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి సంబంధిత వైద్యులు వచ్చి పరీక్షలు చేసినరు. మిషన్ భగీరథ పుణ్యాన నల్లగొండల ఫ్లోరైడ్ బంద్ అయిందని ప్రకటించినరు. మిషన్ భగీరథ నీళ్లు తాగి, ఎంట తెచ్చుకున్న బాటిల్ నీళ్లను కూడా పడేసినరు.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
CM KCR| ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
KCR | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు
CM KCR | కలిసిపోయి ఆత్మీయంగా మాట్లాడుతారు.. కరిగిపోయి అవసరమైన సాయం చేస్తారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

