రాశిఫలాలు
ఈ వారం రాశి ఫలాలు అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 31 వరకు అందిస్తున్నాం. ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి.
మేషం
ఈ వారం అదృష్టం కలిసివస్తుంది. సాహసించి పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఏమరుపాటు తగదు. వారం మధ్యలో కొన్ని చికాకులు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. పలుకుబడితో కార్యసిద్ధి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సూర్యారాధన శుభప్రదం.
తుల
ఈ వారం తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, నదీ స్నానాలు చేస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. మంచివారి సాహచర్యం లభిస్తుంది. కొత్త దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వారాంతంలో శుభవార్త వింటారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
వృషభం
ఈ వారం అనుకూలంగా ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందులకు హాజరవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచివారితో సాహచర్యం కలుగుతుంది. ఉన్నత విద్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం ఉంటుంది. సోదరులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. శివాలయాన్ని సందర్శించండి.
వృశ్చికం
కొన్ని విషయాల్లో తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు శుభ సమయం. అధికారుల మన్ననలు అందుకుంటారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు మంచి సమయం. దుర్గా స్తోత్రాలు పఠించండి.
మిథునం
ఈ వారం ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రారంభించిన పనులు నిదానంగా ముందుకుసాగుతాయి. వారాంతంలో శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారులకు భాగస్వాములతో సఖ్యత నెలకొంటుంది. భూ లావాదేవీలకు వారాంతం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ధనుస్సు
ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు మంచి సమయం. సాహసంతో ముందుకువెళ్తారు. అనేక పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సమయపాలన అవసరం. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. న్యాయపరమైన సమస్యలు అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. శివాలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
ఈ వారం అనుకూల సమయం. సమయస్ఫూర్తితో చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూల తీర్పులు వెలువడుతాయి. శివాలయాన్ని సందర్శించండి.
మకరం
శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సూర్యారాధన మేలు చేస్తుంది.
సింహం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. శుభకార్య విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రాబడి పెరుగుతుంది. అయితే అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. వారం మధ్య నుంచి పరిస్థితుల్లో అనుకూల మార్పు వస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయి. దత్తాత్రేయస్వామి ఆరాధనతో మేలు జరుగుతుంది.
కుంభం
ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంగా పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, పనులపై ఏకాగ్రత అవసరం. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కన్య
ఉద్యోగులకు ఉన్నతమైన సమయం. బాధ్యతలు పెరిగినప్పటికీ, అందుకు తగ్గట్టుగా పనిచేస్తారు. అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతి, అనుకూల బదిలీ అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో స్వల్ప చికాకులు ఉంటాయి. వాహన మరమ్మతులు ముందుకురావొచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు రాబడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
మీనం
రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి,
ఎమ్మెస్సీ, నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

