యువతరం కోసం భారత్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ యాక్ససరీల సంస్థ ఫాస్ట్‌ట్రాక్.. సరికొత్త రగ్గ్డ్ స్మార్ట్ వాచీలకు రూపకల్పన చేసింది. ఫాస్ట్‌ట్రాక్ ఎక్స్ట్రీమ్ ప్రొ పేరుతో ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 466*466 పిక్సెల్ రిజల్యూషన్ కలిగిన 1.43 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లేను ఏర్పాటుచేసింది. సింగిల్ సింక్ బ్లూటూత్ కాలింగ్‌తోపాటు 100కుపైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను ఈ వాచీలో పొందుపరిచింది. క్యాలిక్యులేటర్, ఆటో స్ట్రెస్ మానీటర్, ఇన్ బిల్ట్ గేమ్స్, ఏఐ వాయిస్ అసిస్టెంట్లాంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తున్న ఈ వాచీని చేతికి పెట్టుకొని ఈత కూడా కొట్టొచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో అత్యవసర శాఖలను అప్రమత్తం చేసే ఎస్ఓఎస్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తున్నది. ఏడాది వారంటీతో వస్తున్న ఈ స్మార్ట్ వాచీ ధర. రూ. 3,999. fastrack.inద్వారా కొనుగోలు చేయవచ్చు.