క్రియేటివ్ గెలీలియో అనే ఎడ్యుస్టార్టప్ ద్వారా ప్రాథమిక విద్యలో కొత్త మార్పు తీసుకొచ్చారు ప్రేమా ఝున్ ఝున్ వాలా. అంతేనా, చదువులకు సాంకేతికత జోడించారు. గేమిఫికేషన్ పరిచయం చేశారు. గుజరాతీ వ్యాపార కుటుంబం ఆమెది. తండ్రికి జనపనార మిల్లులు ఉండేవి. ఆయనతోపాటు తనూ టూర్లకు వెళ్లేవారు. అలా దేశమంతా తిరిగారు. సామాన్యుల జీవితాలను చూశారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత సింగపూర్ పయనమయ్యారు. అక్కడే తన కలలకు రూపమిచ్చి.
‘లిటిల్ పెడింగ్టన్’ పేరుతో తొలి ప్రీ స్కూల్ లాంచ్ చేశారు. కొద్దికాలంలోనే మంచి పేరు వచ్చింది. కరోనా తర్వాత భారత్‌కు తిరిగొచ్చి ‘క్రియేటివ్ గెలీలియో’కు శ్రీకారం చుట్టారు. ఇదో లెర్నింగ్ యాప్. పిల్లలు చదువుల కోసం బడికి వెళ్తారు. వినోదం కోసం టీవీ చూస్తారు. చదువులోనే వినోదాన్ని భాగం చేస్తే.. ఇంకా ఆసక్తిగా చదువుకుంటారని ఆమె ఆలోచన. లిటిల్ సింగం, బాల గణేశ్, చోటా భీమ్.. తదితర పాత్రలనూ పాఠాలలో భాగం చేశారు. పిల్లల ఆసక్తి, అభిరుచి, లోపాలు.. అంచనా వేయడానికి కూడా ఈ యాప్‌లోని డేటాను విశ్లేషిస్తారు. డేటా ఎనలిటిక్స్ జోడించడం ద్వారా ఇది సాధ్యమైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్యీ) కూడా ఈ ఆవిష్కరణ పట్ల ఆసక్తి చూపుతున్నది.