దియా మెహతా జైన్.. గృహిణి, ఫ్యాషన్ కన్సల్టెంట్, ైస్టెలిస్ట్. ముంబైలో పుట్టి పెరిగిన దియా.. ఇరవై నాలుగేండ్ల వయసులో ప్రవాసుడు ఆయుష్ జైతాను వివాహమాడారు. భర్తతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడే ఫ్యాషన్ కన్సల్టెంట్‌గా కెరీర్ ఆరంభించారు. ‘చాలామంది ఏదో ఓ బ్రాండ్‌కు పరిమితమైపోతారు. ఫ్యాషన్ విషయంలో ఆ పట్టింపు పనికిరాదు. ప్రతి బ్రాండ్‌నూ స్వాగతించాలి. మ్యాచింగ్ మోజులో పడిపోయి కాలాన్ని వృథా చేసుకోవద్దు.
మిక్స్ అండ్ మ్యాచ్‌తోనూ అద్భుతాలు సాధ్యమే’ అని సలహా ఇస్తారు దియా. విదేశాల్లో భారతీయ వస్ర్తాలకు ప్రచారం కల్పించే బాధ్యతనూ భుజానికి ఎత్తుకున్నారామె. తను డిజైన్‌చేసే పటోలా గాగ్రాకు ఫ్యాషన్ మార్కెట్లో ఎంతో ఆదరణ ఉంది. భారతదేశంలో అంతరించిపోతున్న వస్త్ర సంప్రదాయాలను, కనుమరుగు అవుతున్న చేనేత కళాకారులను కాపాడుకోవడం మన కర్తవ్యమని గుర్తు చేస్తారు. ‘నేను ఎంతోమంది విశ్వ సుందరీమణులను చూశాను. కానీ మా అమ్మను మించిన అందగత్తె ఈ ప్రపంచంలోనే లేదని అనిపిస్తుంది’ అని చెబుతూ తన తల్లే తన ైస్టెల్ ఐకాన్ అని స్పష్టం చేస్తారు.