గులాబీ చీరకు అంతర్జాతీయ గుర్తింపు
ఓ చీరను విశ్వ కళా జగత్తు గుర్తించింది. ఆరుగజాల స్ఫూర్తి సంకేతమని కొనియాడింది. నమూనాగా ఒక చీర పంపమంటూ భారత్‌లోని ఓ మహిళా సంఘానికి సమాచారం ఇచ్చింది. లండన్‌లోని ఇండియన్ మ్యూజియంలో త్వరలో ఓ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది.
ఓ చీరను విశ్వ కళా జగత్తు గుర్తించింది. ఆరుగజాల స్ఫూర్తి సంకేతమని కొనియాడింది. నమూనాగా ఒక చీర పంపమంటూ భారత్‌లోని ఓ మహిళా సంఘానికి సమాచారం ఇచ్చింది. లండన్‌లోని ఇండియన్ మ్యూజియంలో త్వరలో ఓ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. అందులో ‘గులాబ్ గ్యాంగ్’ సభ్యులు కట్టుకునే గులాబీ రంగు చీరను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ‘ఎవరీ గులాబ్ గ్యాంగ్’ అంటారా? ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో.. వివక్షకు, హింసకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన స్త్రీ శక్తి ఇది. ఆ బృందంలో పదకొండు లక్షలమంది సభ్యులున్నారు.
పద్దెనిమిది నుంచి అరవై వరకు.. అన్ని వయసులవారూ సభ్యత్వానికి అర్హులే. సంపత్‌పాల్ దేవి అనే సామాన్య మహిళ పందొమ్మిదేండ్ల క్రితం ఈ సంస్థను ప్రారంభించారు. ఎక్కడ ఏ స్త్రీకి అన్యాయం జరిగినా ఎర్ర చీమల దండులా క్షణాల్లో ప్రత్యక్షమైపోతారు. ‘ఒకరి కోసం అందరు’ గులాబ్ గ్యాంగ్ నినాదం. ‘గులాబీరంగు చీర ఓ ఉద్యమానికి, మహిళల సమైక్యతకు ప్రతీకగా మారడం మమ్మల్ని ఆకర్షించింది. ఇదో అరుదైన ఘట్టం’ అంటారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

