పెండ్లయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోని ప్రబుద్ధులను ఉద్దేశించిన సామెత ఇది.
తల్లిదండ్రులను ఎవరైనా సరిగా చూసుకోకపోతే, కనీసం తిండికూడా పెట్టకపోతే ఇరుగు
పొరుగు నోట్లకెల్లి వచ్చే మొదటి మాట ఇదే. చిన్నప్పుడు తల్లిదండ్రులపై ఉండే ప్రేమానురాగాలు.. గడ్డాలు మీసాలు పెరిగి, పెండ్లిచేసుకొని తమకంటూ ఓ కుటుంబం ఏర్పాటు చేసుకొన్నాక ఉండవని చెప్పే సందర్భం ఇది. పెద్దయ్యాక తల్లిదండ్రుల మాట వినకుండా మూర్ఖంగా
ప్రవర్తించే వారిని ఉద్దేశించి కూడా ఈ సామెతే చెబుతారు జానపదులు. కన్నవాళ్లు అల్లం అయిపోయారనీ, పెండ్లాం బెల్లమైందనీ అంటారు.