Yuzvendra Chahal : మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. కొందరు పాటలు వింటారు. మరికొందరు డాన్స్ చేస్తారు. కానీ టీమిండియా లెగ్ స్పిన్నర్ (Yuzvendra Chahal) ఏం చేస్తాడో తెలుసా..? చెస్ ఆడతాడు. అవును.. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. దుబాయ్‌లో జరుగుతున్న గ్లోబల్ చెస్ లీగ్(Global Chess League) చూసేందుకు వచ్చిన చాహల్ తన చెస్ అనుభవాలను పంచుకున్నాడు. ‘చెస్ ఆట నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. పర్యటనల్లో ఖాళీ సమయంలో దొరికితే చాలు చదరంగం బోర్డు ముందు కూర్చుంటా.
రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin), పర్ఫార్మెన్స్ కోచ్ శంకర్ బసు(Shankar Basu) నా చెస్ పార్ట్నర్ అని చాహల్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు చెస్, క్రికెట్.. దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే క్రికెట్ ఆడేటప్పుడు మైదానంలో దూకుడు ప్రదర్శిస్తాం. అదే చెస్ అనుకోండి… ఎత్తులు వేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం అని ఈ లెగ్‌స్పిన్నర్ అన్నాడు.
అంతేకాదు చెస్ తనకు క్రికెట్లో రాణించేందుకు ఉపయోగపడిందని చెప్పాడు. ‘చెస్ ఆడుతున్న సమయంలో నేను మొదటిసారి జెర్సీ వేసుకున్నా. ఈ ఆట వల్ల ప్రశాంతంగా ఉండడం అలవడింది. అంతేకాదు క్రికెట్లో రాణించేందుకు ఉపయోగపడింది. అవును.. కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేసినా కూడా వికెట్ దక్కదు. అలాంటప్పుడు కామ్‌గా ఉండడం చాలా అవసరం’ అని చాహల్ వెల్లడించాడు.
ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు ఆడిన చాహల్ అరుదైన ఘనత సాధించాడు. సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో(Dwayne Bravo) 184 వికెట్ల రికార్డును బద్ధలు కొట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రానాను ఔట్ చేసి ఈ ఫీట్‌కు చేరువయ్యాడు. ప్రస్తుతం చాహల్ ఖాతాలో 187 ఐపీఎల్ వికెట్లు ఉన్నాయి. చాహలో 2013లో ముంబై ఇండియన్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఆడాడు. ఐపీఎల్లో అదరగొట్టిన చాహల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈమధ్యే బీసీసీఐ ప్రకటించిన వెస్టిండీస్ పర్యటనకు ఎంపికైన వన్డే బృందంలో ఈ లెగ్‌స్పిన్నర్ చోటు దక్కించుకున్నాడు.